మెట్రో టైమింగ్స్ మారాయి
x
hyderabad metro

మెట్రో టైమింగ్స్ మారాయి

ఉదయం ఆరు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు


నవంబర్ మూడో తేదీ నుంచి మెట్రో టైమింగ్స్ మారాయి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మైట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు చెప్పారు. ఈ మేరకు మెట్రో శనివారం ప్రకటన విడుదల చేసింది. పొడిగించిన వేళల ప్రకారం వారంలో అన్ని రోజులు, అన్ని టెర్మినల్స్ నుంచి మెట్రో రైళ్లు ఉదయం ఆరు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. సవరించిన సమయానికి అనుగుణంగా ప్రయాణికులు తమ ప్లాన్ మార్చుకోవాలని మెట్రో ఆ ప్రకటనలో పేర్కొంది.


ఇప్పటివరకు వర్కింగ్ డేస్ లో ఉదయం ఆరు గంటలకు మొదటి ట్రైన్, రాత్రి పదకొండున్నర గంటలకు చివరి ట్రైన్ ఉండేది. శనివారం మొదటి ట్రైన్ ఉదయం ఆరు గంటలకు, చివరి ట్రైన్ ఏడుగంటలకు ప్రారంభమయ్యేది. ఆదివారం మొదటి ట్రైన్ ఏడు గంటలకు, చివరి ట్రైన్ 11 గంటలకు ప్రారంభం అయ్యేది. సవరించిన ప్రకారం వర్కింగ్ డేస్ తో పాటు వీకెండ్స్ లో కూడా యధావిధిగా సమయాలు ఉండనున్నాయి.

Read More
Next Story