గ్రామీణ ఉపాధి పథకానికి కొత్త పేరు, పని దినాలు 125కి పెంపు
x

గ్రామీణ ఉపాధి పథకానికి కొత్త పేరు, పని దినాలు 125కి పెంపు

గ్రామీణ ఉపాధి పథకం అయిన MGNREGA పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..


ఇండియాలోని ప్రధాన గ్రామీణ ఉపాధి పథకం అయిన MGNREGA పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అంటే డిసెంబర్‌ 12న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. MGNREGAకు బదులుగా ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ యోజన’ అనే కొత్త పేరును ఆమోదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పథకం పేరుమార్పుతో పాటు, కనీస హామీ ఉపాధి దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది. అలాగే, గ్రామీణ కార్మికులకు చెల్లించే కనీస దిన వేతనాన్ని రూ.240కి పెంచింది.

ఈ పథకం మొదట 2005లో ‘నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (NREGA)’ పేరుతో ప్రారంభమైంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్, 2005 (NREGA) పేరును 2009లో చేసిన సవరణ ద్వారా ‘మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (MGNREGA)’గా మార్చారు. ఇందుకు అనుగుణంగా, చట్టంలోని సెక్షన్ 1(1)ను సవరించి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే పదాల స్థానంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే పదాలను చేర్చారు.


మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ (మహాత్మా గాంధీ NREGS) అనివార్యమైన వేతన ఉపాధి కార్యక్రమం. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబంలో నైపుణ్యం లేని మానవ శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి హామీ ఇవ్వడం ద్వారా జీవన భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది భారతదేశంలో ‘పనిచేసే హక్కు’ (Right to Work) సూత్రాన్ని అమలు చేసే ముఖ్యమైన కార్మిక చట్టంగా గుర్తింపు పొందింది. గ్రామీణ ప్రాంతాల్లోని అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికులకు జీవన భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ఈ చట్టం ప్రకారం, పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబంలోని పెద్దలకు ఏటా కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో ఈ సంఖ్యను 125 రోజులకు పెంచడం గ్రామీణ ఉపాధి భద్రతకు మరింత ఊతమిచ్చే చర్యగా భావిస్తున్నారు.
Read More
Next Story