ట్రాప్ హౌస్ లో ఇరుక్కున్న మైనర్లు
x
Minors in a trap house

ట్రాప్ హౌస్ లో ఇరుక్కున్న మైనర్లు

యువతను ముఖ్యంగా మైనర్లను ఆకర్షించటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.


‘‘స్వర్గాన్ని చూడాలాని అనుకుంటున్నారా ? అయితే రండి మేము నిర్వహిస్తున్న పార్టీకి’’.

‘‘కొత్తరుచులను చూడాలని అనుకుంటున్నారా అయితే పార్టీకి రండి’’ అంటు ఓ ఫామ్ హౌస్ నిర్వాహకుడు కొందరిని సోషల్ మీడియాలో ఆహ్వానించాడు. నిర్వాహకుడి ఆహ్వానానికి 50 మందికిపైగా ఆకర్షితులయ్యారు. ఇంకేముంది ఆదివారం ఒక ఫామ్ హౌస్ లో భారీఎత్తున పార్టీ మొదలైంది. అయితే కొంతసేపటికే పోలీసులు చేసిన దాడిలో అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే మొయినాబాద్ ఏరియాలోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ ఉంది. ఇందులో కిషన్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటుచేశాడు. యువతను ముఖ్యంగా మైనర్లను ఆకర్షించటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.

గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తుకు యువత, పిల్లలు చాలాతొందరగా ఆకర్షితులవుతున్న విషయం చాలాఆందోళనకలిగిస్తోంది. డ్రగ్స్, గంజాయిని కంట్రోల్ చేయటానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. ఇందులో భాగంగానే కిషన్ కుడా తన సోషల్ మీడియా ఖాతాలో కొద్దిరోజుల క్రితం ఒక పోస్టుపెట్టాడు. అందులో ఏముందంటే స్వర్గాన్ని చూడాలని అనుకుంటున్న వారు, కొత్తరుచులను చూడాలని అనుకుంటున్నవారు తాను నిర్వహిస్తున్న ఫామ్ హౌసు పార్టీకి అటెండ్ కావాలని చెప్పాడు. ఎంట్రీ ఫీజు 1300 రూపాయలుగా నిర్ణయించాడు.

నిర్వాహకుడి పోస్టుకు బాగా స్పందనవచ్చింది. పార్టీకి హాజరుకావాలని అనుకున్న వారంతా కిషన్ చెప్పిన ఖాతాకు డబ్బులు కట్టేశారు. దాంతో ఆదివారం భారీపార్టీ మొదలైంది. పార్టీలో విదేశీమద్యం, గంజాయిని కూడా నిర్వాహకుడు సరఫరా చేశాడు. అయితే ఈవిషయం పోలీసులకు దృష్టిలోపడింది. ముందుగానే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకోకుండా పార్టీ మొదలయ్యేంతవరకు పోలీసులు వెయిట్ చేశారు. పార్టీ మొదలైందన్న సమాచారం అందగానే ఒక్కసారిగా ఫామ్ హౌస్ పై దాడిచేశారు. దాడిలో పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిసమాచారం తెలుసుకున్న కొందరు తప్పించుకున్నట్లు సమాచారం.

ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే పట్టుబడిన 50 మందిలో 15 మంది మైనర్లున్నారు. అలాగే అమ్మాయిలు, అబ్బాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారికందరికీ టెస్టులు చేయిస్తే ఇందులో నలుగురికి పాజిటివ్ రిజల్టు వచ్చినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story