హరీష్ రావుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
x

హరీష్ రావుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

మాది బీఆర్ఎస్‌లా మాటల ప్రభుత్వం కాదని చేతల సర్కార్ అని అన్న మంత్రి.


కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తరహాలో తాము పనులను శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోలేదన్నారు. బీఆర్ఎస్ తరహాలో తాము మాటలతో కోటలు కట్టమని, చేతలతో చేసి చూపుతామని కౌంటర్ ఇచ్చారు. శంకుస్థాపన స్థాయిలో బీఆర్ఎస్ వదిలేసిన ఆసుపత్రులను తమ ప్రభుత్వం 21 నెలల్లో పూర్తి చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన రూ.40 వేల కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. నిత్యం ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, రాత్రింబవళ్లు పనులను జరిపిస్తున్నామని చెప్పారు.

‘‘టిమ్స్ ఆసుపత్రిని ఆరు నెలల్లోగా పూర్తి చేయకపోతే ఉద్యమిస్తాం’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆయనకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సనత్ నగర్ టిమ్స్ భవనాల నిర్మాణాన్ని అక్టోబర్ 31కి ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ‘‘అల్వాల్ ఆసుపత్రి దగ్గర వెయ్యి మంది ఒకే షిఫ్టులో పనిచేస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిని రూ.2వేల కోట్లతో నిర్మిస్తున్నాం. దానిని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఎన్నికల రావడంతో రాజకీయాల కోసం పొలిటికల్ విజిట్స్ చేస్తున్నారు. ప్రజల మేలు కోసం మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.

‘‘ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయి హంగులతో రూ.8కోట్ల వ్యవయంతో నిర్మించాం. త్వరలోనే డిజిటల్ క్లాస్‌తో పాటు ఏసీ రూమ్‌లను ఏర్పాటు చేస్తాం. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోనే ది బెస్ట్ మోడల్ స్కూల్‌గా నిలుస్తుంది. విద్యకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచతో పోటీ పడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్ అంతా కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించాం’’ అని అన్నారు.

టిమ్స్ ఆసుపత్రిపై హరీష్ ఏమన్నారంటే..

‘‘బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ‘ఒకటో తేదీనే జీతాలు’ అన్న రేవంత్‌రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదు? రూ. 1400 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? బీఆర్ఎస్ పాలనలో పురోగమనం – కాంగ్రెస్ పాలనలో తిరోగమనం. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్‌రెడ్డిని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Read More
Next Story