యాదగిరి గుట్ట లడ్డుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
x

యాదగిరి గుట్ట లడ్డుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న అభియోగాలు దేశమంతా తీవ్ర దుమారం రేపాయి.


తిరుమల తిరుపతి లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న అభియోగాలు దేశమంతా తీవ్ర దుమారం రేపాయి. దీంతో అలెర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సహా ముడిసరుకులను పరిశీలించారు. నెయ్యిని ల్యాబ్ పరీక్షలకు కూడా పంపించారు. తాజాగా వాటిలో యాదగిరిగుటగ్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రసాద నమూనాల రిపోర్ట్‌లు వచ్చాయి. వాటిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. సచివాలయంలో ఈరోజు ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం లడ్డూ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. లడ్డూ నాణ్యతకు రిపోర్ట్ అద్దం పట్టిందన్నారు. లడ్డు టెస్ట్ ఫలితాలతో పాటు మరికొన్ని కీలక విషయాలను కూడా ఆమె వెల్లడించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండేలా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.

రిపోర్ట్ ఏం చెప్తోందంటే..

‘‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డులను పరీక్షించగా వాటిలో యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆలయ లడ్డు నాణ్యత విషయంలో భేష్ అని రిపోర్ట్ ఫలితం వచ్చింది. ఈ లడ్డులో ఎటువంటి కల్తీ లేదు. నెయ్యి సహా అన్ని ముడిసరుకులు కూడా మేలిమైన రకానివే అని తేలింది’’ అని వెల్లడించారు. అనంతరం వేములవాడ దేవస్థానం మాస్టర్ ప్లాన్‌ను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారామే. అదే విధంగా అన్ని దేవాలయాల్లో అతి త్వరలోనే 24 రకాల ఆన్‌లైన్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా కొండా సురేఖ ఏం చెప్పారంటే..

‘‘యాదగిరి గుట్ట లో ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పించాం. 14 చోట్ల త్రాగునీటి సదుపాయం,టాయిలెట్స్ ఏర్పాట్లు చేశాం. విష్ణు పుష్కరి గుండం,స్వాతి నక్షత్రంలో గిరీ ప్రదక్షణ చేసే ఏర్పాటు చేశాం. బాలింతలు,వృద్దులు,వికలాంగుల కోసం లాంజు లు ఏర్పాటు చేశాం. ఎలక్ట్రికల్ వాహనాల సదుపాయం ఏర్పాటు చేశాం. సంస్కృతిక వేదిక పై నిత్యం కళ రూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. యాదగిరి గుట్ట పై నిద్ర చేసే వసతి కల్పించాం. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆటోలను గుట్ట పైకి అనుమతిస్తున్నాం’’ అని వివరించారు.

అందుబాటులోకి భారీ అన్నదాన సత్రం

‘‘నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరో అన్నదాన సత్రం 2500 భోజనం చేసేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకురబోతున్నాం. రాజగోపురనికి బంగారు తపడం కోసం ఒప్పందం జరిగింది. మార్చి 20 వరకు అది పూర్తి చేసేలా ఒప్పందం ప్రభుత్వం చేసుకుంది. తిరుపతి లడ్డు వ్యవహారం తర్వాత అన్ని ఆలయాల్లో ప్రసాదాల టెస్ట్ లకు పంపడం జరిగింది. భద్రాచలం ఆలయం పేరు పెద్దగా ఉంది.. ఆలయం విస్తీర్ణం తక్కువ ఉంది. ఉత్సవ సమయంలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. కాబట్టి విస్తరణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు భద్రాచలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమౌతోంది. శాశ్వత షెడ్ నిర్మాణానికి విరాళం ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు’’ అని వెల్లడించారు.

వారికి ప్రత్యేక దర్శనం

‘‘3 కోట్ల తో 30 రూములను భక్తుల సౌకర్యం కు అందుబాటులోకి తీసుకువస్తుంది. బాలింతలు,వృద్దులు,వికలాంగులు ప్రత్యేక దర్శనల ఏర్పాటు అదేశించాం. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంచాం. భక్తులకు 24 రకాల ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చాం. వేములవాడ లోని కోడెలను రైతులకు 850 అందాజేశాం. అర్హులైన రైతులకు మాత్రమే కలెక్టర్ ద్వారా అంగజేస్తున్నాం. వెటర్నరీ డాక్టర్లు,అసిస్టెంట్ లు.. 30 మంది గోపాలకులను కూడా నియమించడం జరిగింది’’ అని తెలిపారు.

అభివృద్ధికి రూ.50 కోట్లు

‘‘భద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం జరుగుతుంది. 50 కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధి కి కేటాయించడం జరిగింది. వేములవాడ గోపురానికి బంగారం తలడం, వేండి పల్లకి చేయిస్తున్నాం. బాసర సరస్వతి ఆలయం వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. ప్రతి గురువారం గోదావరి హారతీ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఆలయాల రి క్లాసిఫికేషన్ ను గత పద్నాలుగు లో పట్టించుకోలేదు. అదే చేసే ఆలోచనలో ప్రభుత్వం. దీంతో ఉద్యోగుల పోజిషన్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. దేవుడి మన్యాలు పలు చోట్ల అన్యాక్రాంతం అయ్యింది. అటువంటి వారి నుంచి వెనక్కి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. దేవాలయం మన్యలాకు చాలా వరకు లిటిగేషన్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది’’ అని వివరించారు.

ఆలయాలను కాపాడతాం

‘‘పురాతన ఆలయాలను సైతం కపాడుకుంటాం. ఫెస్టివల్ కమిటీలు GO 4 ద్వారా నోటిఫికేషన్ జారీ చేశాం. ఇంకా 81 దేవాలయాలకు ఈ సేవలు విస్తరించేందుకు పరిశిలిస్తున్నాం. క్యుఆర్ కోడ్ ద్వారా దేవాలయాల చరిత్ర తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. యాప్ ద్వారా ఆలయాల్లో భక్తులకు ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లావచ్చు. ఏకో టూరిజం ద్వారా వృత్తి నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం. పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం, ఎకో సిస్టమ్ పాలసి తీసుకువస్తున్నాం. ఆరు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 33 మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది’’ అని అన్నారు.

బదిలీలు చేస్తాం..

‘‘దేవాదాయ శాఖలో ఉద్యోగుల ట్రాన్స్ఫర్ లు చేశాం. దేవాదాయ భూములను ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఏర్పాటు చేశాం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం మీద దాడిని సరికాదు. దేవుడు ఎవరీకైన దేవుడే.. వారి మీద చర్యలు తీసుకుంటున్నాం. వారు ఎందుకు చేస్తున్నారు అనేది తెలియదు. ఎన్‌ఐఏ విచారణ జరగాల్సిందే. మేము కోరుతాం’’ అని చెప్పారు.

Read More
Next Story