యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
x

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

‘స్టాప్ స్టబ్ స్టెన్స్ రన్’ ప్రారంభించిన మంత్రి పొన్నం


యువతను పెడదోవపట్టిస్తున్న మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని బిసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్తు చిత్తవుతోందని మంత్రి పేర్కొన్నారు.

ఆదివారం అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘స్టాప్ సబ్స్ టెన్స్ అబ్యూస్’ రన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాలను నిరోధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో ఎక్కడ గంజాయి మొక్క పెరిగినా ఈగల్ టీం ఇట్టే పసిగడుతుందన్నారు.

Read More
Next Story