Ponnam Prabhakar | ‘కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి’
x

Ponnam Prabhakar | ‘కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి’

కుల గణనపై తీవ్ర విమర్శలు వస్తుండటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కుల గణను విమర్శించడాన్ని బీసీలపై దాడిగానే చూస్తామని ఆయన తెలిపారు.


కుల గణనపై తీవ్ర విమర్శలు వస్తుండటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కుల గణను విమర్శించడాన్ని బీసీలపై దాడిగానే చూస్తామని ఆయన తెలిపారు. విమర్శలు చేస్తున్న వారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని సూచించారు. కుల గణనపై గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీలకు మేలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రమిస్తోందని, దానిని అడ్డుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దని కోరారు. ఈ సందర్భంగానే నిర్ణీత గడువులోగా కుల గణనను పూర్తి చేసిన యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కుల గణన వివరాలకు పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని చెప్పారు. ఈ విషయంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

‘‘ఎవరు..ఎంతో వారికి అంత అని రాహుల్ గాంధీ చెప్పారు. అందుకు అనుగుణంగా కుల గణన సర్వే జరిగింది. బడుగు..బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ ఒక్కటే. సర్వే లో పాల్గొనని వాళ్ళు... ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు. సర్వే కి వెళ్ళిన వాళ్లకు రెస్పాండ్ కాకుండా... ఇప్పుడు సర్వే రాలేదు అంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదు. బీసీలకు చాలా ఏండ్ల తర్వాత మేలు జరగబోతుంది. అడ్డుకోవాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇన్నాళ్లు ఉద్యమం చేసిన పోరాట యోధులకు అభినందనలు. ప్రభుత్వ ఆలోచన చివరి వరకు అందే వరకు అదే స్ఫూర్తి కొనసాగాలి. సర్వే.. 32 మంది కలెక్టర్ లు.. లక్ష మంది సిబ్బందితో సర్వే చేయడం జరిగింది. రేపటి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ రావాలి. బీసీలకు మేలు చేయాలి అనుకుంటే రావాలి. రేపు కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చాం’’ అని తెలిపారు.

‘‘బీసీ సామాజిక వర్గాలు ముందుకు రావాలి అని కోరుతున్నా. 3.1 శాతం సర్వే లో పాల్గొనలేదు. సర్వేకి వెళ్ళిన అధికారుల మీద దాడులు చేసిన సంఘటనలు కూడా చూశాం. కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి. కవిత కుటుంబం లో మిగిలిన కుటుంబ సభ్యులు వివరాలే ఇవ్వలేదు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మా దృష్టికి తెండి.. మీ పెద్దలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదు.. చెప్పండి’’ అని అడిగారు.

Read More
Next Story