ప్రైవేటు బస్సులకు ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
సంక్రాంతి పండుగ సందర్భంగా రవాణా సంస్థ వేగం పుంజుకుంటోంది. భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రవాణా సంస్థ వేగం పుంజుకుంటోంది. భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించొద్దని వివరించారు. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కల్పించినా ఏమాత్రం సహించేది లేదని, వెంటనే సదరు ప్రైవేటు బస్సును సీజ్ చేస్తామని చెప్పారు. అదే విధంగా పండగ సమయం కదా ఛార్జీలను పెంచేద్దాం అన్న ఆలోచనలో ఉంటే వెంటనే విరమించుకోవాలని, ఛార్జీల పేరిట దోపిటీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ప్రయాణికుడి దగ్గర నుంచి రెగ్యులర్ ఛార్జీలనే వసూలు చేయాలని ప్రకటించారు. ‘‘ఏ ప్రైవేటు బస్సు అయినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే సదరు అంశాన్ని ప్రయాణికులు వెంటనే రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు చేపట్టాలి. సంక్రాంతి పండగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అవసరం అనుకుంటే ఈ ప్రత్యేక బస్సుల సంఖ్యను మరింత పెచుతాం’’ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నిబంధనలు పాటించాల్సిందే: కమిషనర్
ఈ క్రమంలోనే ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు రవాణా శాఖ కమిషనర్ సరేంద్రమోహన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించినా, సరకు రవాణఆ చేసినా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తప్పవు. ఈ విషయమైన వారం రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం. ప్రైవేటు బస్సులపై ఇప్పటికే 150 కేసులు నమోదు చేశాం’’ అని వెల్లడించారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం 6432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు నేటి నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రతి మేజర్ బస్ స్టేషన్ వద్ద ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలవకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చా అవకాశం ఉందని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడ ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండగ పూట ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే వసూలు చేయాలని అదనంగా వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులకు సూచించారు. అధికారులు ఫీల్డ్ లోనే ఉండాలని నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించాలని అదనపు చార్జీలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే బస్సులు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధానత్య కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్య స్థానాలకు వెళ్లాలని సూచించారు.