ఆర్టీసీ సమ్మె వద్దు.. మంత్రి పొన్నం సూచన
x

ఆర్టీసీ సమ్మె వద్దు.. మంత్రి పొన్నం సూచన

ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.


తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. కొన్నేళ్లుగా తమ సమస్యలను వివరిస్తున్నా ప్రభుత్వం వాటిని పెడచెవిన పెడుతుండటంతో మే 7 నుంచి సమ్మె చేపట్టాలని కార్మికులు నిశ్చయించుకున్నారు. మే6న ఆఖరి బస్సు డిపోకు చేరిన మరుక్షణం నుంచి తమ సమ్మె స్టార్ట్ అవుతుందని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. కాగా తాజాగా ఈ సమ్మెపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇప్పుడిప్పుడే ఆర్‌టీసీ గాడిన పడుతుందని, లాభాలను చూస్తోందని, ఇలాంటి సమయాల్లో సమ్మెలు చేయొద్దని కోరారు.

‘‘ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడింది. తెలంగాణ సాధించిన తరువాత 10 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాం ,ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ గా మార్చి అందరిని అందుబాటులోకి తెచ్చాం. వారి పెండింగ్ బకాయిలు TA,DA లు ఇచ్చాం’’ అని తెలిపారు.

‘‘కొత్త నియామకాలు చేపడుతున్నాం, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. మూడు ప్రధాన అంశాలు ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ గా ముందుకు పోతున్నాం. సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. వారి రెండు ప్రధాన అంశాలు ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉన్నాయి. వాటిని కూర్చొని మాట్లాడుకుంటాం. ట్రేడ్ యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సమ్మెకు పోయే కాలం కాదు..ఆర్టీసీ శ్రేయస్సు దృశ్య ఇది సమ్మె సమయం కాదు. 1562 కోట్ల పిఎఫ్ కాయలను 600 కోట్లకు తగ్గించాం.. సిసిఎస్ బకాలను పూర్తిగా తగ్గించేసాం. రిటైర్మెంట్ అయిన రోజే వారి బెనిఫిట్స్ ఇవ్వాలని కార్యాచరణ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

‘‘బ్యాంకుల్లో బకాయిలు ఉన్నాయి సంస్థ నిలబడాలి. ఆర్టీసీ 40,000 కుటుంబాలు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారుడుని.. ఆనాడు నైచేలేగా బస్ కి పయ్యా అని నినాదంతో ఉద్యమం చేశారు. సంస్థను ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సానుకూల దృక్పథంతో ముందుకు పోతున్నాం. కిరణ్ కుశత్వంతో పోవడం లేదు. ఆర్టీసీ సమ్మె పునరాలోచన చేయాలి..ముందుగా ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు..నేరుగా సమ్మె అన్నారు. సహృద్భవ సంబంధాలతో ఆర్టీసీని రక్షించుకోవాలి.. మీరంతా నా కుటుంబ సభ్యులు.. ఆర్టీసీ సమ్మె వద్దు మీకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అన్నారు.

Read More
Next Story