నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క
x

నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క

2021లో చేసిన దీక్షకు వివరణ ఇవ్వడానికే.


మంత్రి సీతక్క.. ఈరోజు నాంపల్లి కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. కరోనా సమయంలో కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చాలంటూ ఇందిరాపార్క్ దగ్గర సీతక్క దీక్ష చేశారు. ఆ దీక్షపై అప్పట్లోనే గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు విచారణకు సంబంధించే నాంపల్లి కోర్టు ముందు ఆమె ఈరోజు హాజరయ్యారు. కాగా కోర్టు ముందు హాజరవడంపై మంత్రి సీతక్క స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయాలని ఆనాడు దీక్ష చేశానని, కానీ ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నుంచి పేదలను కాపాడలనుకుంటే దానిని ఆనాటా ప్రభుత్వం ఓర్చుకోలేకపోయిందని అన్నారు.

అసలేమైందంటే..

2021 ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తాండవం చేస్తోంది. కరోనా సోకిన వారికి చికిత్స భారీ ఖర్చుతో కూడుకున్న అంశంగా మారింది. ఆ సమయంలో కరోనా వస్తే చావే అన్న తరహాలో పేదల బతుకులు మారాయి. దాంతో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ మంత్రి సీతక్క.. రోడ్డెక్కారు. కరోనాకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడమే కాకుండా ఉచిత అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు చెల్లించిన ఆసుపత్రి బిల్లులను సీఎంఆర్ఎఫ్ కింద తిరిగి చెల్లించాలని కోరారు. అయితే ఆ సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ నిబంధనలు నడుస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఇందిరాపార్క్ దగ్గర సీతక్క.. దీక్ష నిర్వహించారు. దీంతో ఆమె సహా పలువురు నేతలపై కేసు నమోదు చేశారు. వారి చర్యలు కరోనా వ్యాప్తికి ఊతమిచ్చేలా ఉన్నాయని ఆనాటి ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఆ కేసు ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది.

Read More
Next Story