
సీతక్క మాటలు సినిమా ఫాన్స్ కు అర్థమవుతాయా?
అల్లు అర్జున్ వివాదం మీద తెలంగాణ మంత్రి సీతక్క ఆసక్తికరమయన వాఖ్యలు
బెనిఫిట్ షోలకోసం మూడు వేలు, నాలుగు వేలు పెట్టి బ్లాక్ లో టికెట్ కొని నిర్మాతల, హీరోజేబులు నింపే ఫ్యాన్స్ అంతా పేద కుటుంబాల పిల్లలు. కాపోతే మధ్య తరగతి కుటుంబాలు వాళ్లు. సంధ్య టాకీ స్ వద్ద అల్లు అర్జున్ ని చూసేందుకు విరగబడినవాళ్లంతా ఆటో డ్రైవర్లు, చిన్న ఉద్యోగాలుచేసుకునే వాళ్లు, నెలకు ముప్పైనలభై వేలు సంపాదించే చిరుద్యోగులు మాత్రమే. ఫాన్స్ లో చాల మంది గ్రామీణ యువకులు,నిరుద్యోగులు కూడా ఉన్నారు. వీళ్లు ఎంత ధరపెట్టిన టికెట్ కొంటారని, మొదటిరోజు మొదటి ఆటకు వస్తారని, అపుడు వీలుకాకపోతే రెండో రోజో మూడో రోజో వస్తారని సినిమా వాళ్లకి తెలుసు. భారీ బడ్జెట్ పేరు బెనిఫిట్ షోలు వేసేది వీళ్లకి కొల్లగొట్టేందుకే. ఈ విషయం వాళ్లకి తెలియదు. తెలియకుండా హీరో కల్ట్ అడొస్తూఉంటుంది. వీళ్లకి నిన్న తెలంగాణ మంత్రి ధనసరి సీతక్క చెప్పిన మాటలు అర్థం కావాలి. ఫ్యాన్ పిచ్చి తగ్గాలి.
ములుగులో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొంటూ చాలా ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు. ఇవి అందరిలో ఆలోచన రెకేత్తించాలి. మామూలు రాజకీయ నాయకులు చెబితే తేలికగా తీసిపడేయవచ్చు.సీతక్కకు చరిత్ర ఉంది. అదిప్రజల పక్షాన నిలబడి పోరాడిన చరిత్ర. అందుకే సీతక్క చెప్పే విషయాలను రాజకీయోపన్యాసంగా కొట్టిపడయడానికి వీల్లేదు.ఆమె ఏమన్నారు.
1.. ఒక పోలీసు అధికారి బట్ట లూడదీసిన అవహేళన చేసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చింది. ఇది దేనికి సంకేతం.
2..పుష్ప చిత్రంలో బాధ్యతాయుత పోలీసు అధికారి అవమానానికి గురయ్యాడు. స్మగ్లర్ హీరో అయ్యాడు.
3. అంబేడ్కర్ స్ఫూర్తితో ఓ న్యాయవాది చంకలో బిడ్డ, కడుపులో మరో బిడ్డతో అన్యాయానికి గురైన మహిళ కోసం పోరాడిన కథతో వచ్చిన సందేశాత్మక చిత్రం ‘జై భీమ్’ అవార్డులు రాలేదు కానీ, పోలీసు వ్యవస్థను, రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఓ స్మగ్లర్ కథతో వచ్చిన ‘పుష్ప’ సినిమాకు జాతీయ పురస్కారం వచ్చింది. ఇదేమి అన్యాయం.
4. పుష్ప సినిమా నేర ప్రవృత్తిని ప్రోత్సహిం చేలా ఉంది. సినిమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి, మంచి సందేశంతో సినిమాలు తీయాలి.
Celebrated Christmas in Mulugu, spreading the message of peace, equality & respect for all religions. Films should inspire society with values, not glorify crime. Let’s guide future generations on the right path. #Mulugu #Christmas2024 #Equality #PositiveChange pic.twitter.com/dLYZIMl5R0
— Danasari Seethakka (@seethakkaMLA) December 23, 2024
మరొక కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆసక్తికరమయిన వ్యాఖ్యాలు చేశారు. ఆయన గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
1. రూ.30 వేల జీతం సంపాదించే అభిమాని రూ.3 వేలతో టికెట్ కొని సినీతారల స్టార్ డం కాపాడుతున్నాడు. సూపర్ స్టార్లుగా పేర్కొనే నటులు వందల కోట్లు సంపాదిస్తున్నా సేవా కార్యక్రమాలకు రూపాయి కూడా ఖర్చు చేయరు.
2. ఏ గ్రామాన్నైనా, ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రినైనా దత్తత తీసుకున్నారా? మంచి కార్యక్రమం చేయమని ఏనాడైనా అభిమానులకు పిలుపునిచ్చారా? బ్లడ్ బ్యాంక్ పేరుతో చిరంజీవి ఎంతో మందికి సేవ చేస్తూ అభిమానులతోనూ చేయిస్తుం డగా ఆయన వారసులుగా చెప్పుకొనే కొంతమంది ఏనాడైనా పైసా సహాయం చేశారా?
3. సీఎం మాట్లాడిన మాటలు అబద్ధాలని అల్లు అర్జున్ భావిస్తున్నారా? అసెంబ్లీని అగౌరవపరుస్తున్నారా? చిత్ర పరిశ్రమ నాలుగు కుటుం బాల చేతిలో నలిగిపోతోంది. తెలంగాణ వాళ్ల విషయంలో సినిమా ఇండస్ట్రీ ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు.
4. సినీతారలు రాతి హృదయంతో ఉంటారు. ప్రజ లకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ వస్తారన్న నమ్మకం లేదు. వీరి కంటే సోనూ సూద్, సమంత, మంచు లక్ష్మి నయం.
4. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారు. అర్ధరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీల్లో ఉండటానికి ఇష్టపడతారు.
5. ప్రజలకు ఇబ్బందులు వస్తే ఒక్కరు కూడా స్పందించకుండా దాక్కుంటారు. తమిళ నటులకు ఉన్న సామా జిక స్పృహ తెలుగు నటులకు లేదు.