
అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం
సరుకుల సప్లయర్స్ కు మంత్రి సీతక్క అల్టిమేటం
అలసత్వం ప్రదర్శించిన సరుకుల సప్లయర్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సీతక్క హెచ్చరించారు. మంత్రి సీతక్క శుక్రవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలామృతం, బియ్యం, మురుకుల సరఫరాపై ప్రతి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
పలు జిల్లాల్లో కాంట్రాక్టర్లు సరుకులు సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మంత్రి సీతక్క అగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కెసీఆర్ ఇదే తప్పు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వహాయంలో అలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఇవ్వొద్దు అని ఆమె అధికారులకు ఆదేశించారు. కెసీఆర్ ప్రభుత్వంలో సరుకుల సప్లయర్స్ చేసిన తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని సీతక్క హెచ్చరించారు. అంగన్ వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేయడంలో అలసత్వం ప్రదర్శించకూడదని ఆమె ఆదేశించారు.

