పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్..
దీపావళి అంటే వెలుగుల పండగ అని, ఈ దీపావళికి ప్రతి రైతు ఇంట్లోసంతోషాల వెలుగు పూయాలని దేవుణ్ణి కోరుకున్నానని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
దీపావళి(Diwali) అంటే వెలుగుల పండగ అని, ఈ దీపావళికి ప్రతి రైతు ఇంట్లోసంతోషాల వెలుగు పూయాలని దేవుణ్ణి కోరుకున్నానని మంత్రి తుమ్మల(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం. అదే విధంగా రైతులు(Farmers) కూడా కష్టాల నుంచి బయపడాలని, సంతోషాలతో వారి జీవితాలు వెలగాలన్నదే తమ కోరిక అని అన్నారు. దాన్ని నిజం చేయడానికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని, ఇకపై కూడా తెస్తామని అన్నారా మంత్రి. ‘‘దీపావళి సందర్భంగా ఆ దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు కూడా రైతుల గురించి ప్రార్థించా. ఎటువంటి ప్రకృతి వైపరిత్యాలు లేకుండా రైతులకు మేలు జరగాలని భగవంతుడిని కోరుకున్నా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజా పాలనలో ప్రజలందరికీ మేలు జరగాలన్నదే తన కోరిక అని కూడా చెప్పారు. అందరితో పాటు రాష్ట్రంలోని ఆయిల్ పామ్(Oil Palm) రైతుల జీవితాల్లో కూడా దీపావళి వెలుగులు రానున్నాయి. టన్ను ఆయిల్ పామ్ గెలలు రూ.19వేలకు పైగా ధర పలుకుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పామాయిల్ గిట్టుబాటు ధర రూ.6 వేలు పెరిగిందని వివరించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతాంగ ఆర్థిక స్థితిగతులు మారుతాయని, తెలంగాణ ఆయిల్ పామ్ రైతులు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారని వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇదిలా ఉంటే గతంలో దేశంలో ఆయిల్ పామ్ సాగును మెరుగు పరచడం కోసం మంత్రి తుమ్మల మలేషియాలో కూడా పర్యటించారు. అక్కడి విషయాలను కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు. తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వెల్లడించారు.
మలేషియా పర్యటనలో అవే గమనించా..
మలేషియా పర్యటనలో అనేక అంశాలను పరిశాలించామని, పామాయిల్ సాగుకు వారి వినియోగించే పద్దతులు ప్లాంట్ ప్రాసెసింగ్, రిఫైనరీ ప్లాంట్స్ వంటి విషయాల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆయిల్ పామ్ సాగు, రాబడి వంటి అనేక విషయాలపై ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రులతో చర్చించినట్లు కూడా వివరించారాయన. ఆయిల్ పాట్ సాగుతో పాటుగా తెలంగాణ, మలేషియా మధ్య వాణిజ్య అవకాశాలపై కూడా సుదీర్ఘ చర్చలు చేశామని, ఈ చర్చలు ఫలదాయకంగా సాగాయని మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో కూడా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, ఇప్పటికే ఏయే జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుమతులు ఉన్నాయో కూడా పరిశీలిస్తోందని వెల్లడించారు.
‘‘తెలంగానలో ఆయిల్ పామ్ సాగును విరివిరిగా చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 44,400 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి 2.80 లక్షల టన్నుల పామాయిల్ గెలలు దిగుబడి ఉంది. కేంద్రం తీసుకునన తాజా నిర్ణయంతో తెలంగాణలో పామాయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టాడానికి అవకాశాలు పెరిగాయి. రైతులంతా కూడా పామాయిల్ సాగులో భాగస్వాములు కావాలి. అప్పుడే పామాయిల్ హబ్‌గా తెలంగాణ నిలుస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పామాయిల్‌ను సాగు చేయాలి. తద్వారా రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా లాభముంటుంది’’ అని అన్నారు మంత్రి తుమ్మల.
నిరాశలో రైతులు
కానీ పామాయిల్ దిగుమతిపై పన్ను ఎత్తేయడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ కారణంగానే పామాయిల్ గెలల ధర గణనీయంగా తగ్గిపోయిందని, ఇది పంట సాగు చేయాలనుకునేవారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని మంత్రి తుమ్మ ఇటీవల కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే రైతులకు అధిక ధరలు అందేలా చర్యలు తీసుకున్నారు మంత్రి. ఇదే అంశంపై ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా చర్చించామని, దీంతో పననులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు.