
మంత్రి ఉత్తమ్‌కు తృటితో తప్పిన ప్రమాదం..
ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెనుప్రమాదం తృటిలో తప్పింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పలు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేశారు. కాగా మేళ్లచెరువు దగ్గరకు వెళ్లేసరికి తీవ్ర ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక మేరకు హెలికాప్టర్‌ను మేళ్లచెరువులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన హుజూర్‌నగర్‌కు బయలుదేరారు.
Next Story