
గొర్రెలు, బర్రెలు నా కెందుకు?
వివాదాస్పదమైన మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు
తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గొర్రెలు, బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. సోమవారం ఆయన మీడియా మాట్లాడుతూ తనకు కేటాయించిన ఐదు శాఖలు ఆగమాగంగా ఉన్నాయని వ్యాఖ్యనించారు .పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ శాఖలను ఆగమాగం చేసిందన్నారు. 2023లో ఆయన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచారు. మొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి తనకు కేటాయించిన శాఖల గూర్చి అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
Next Story