
‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’
అడ్లూరి లక్ష్మణ్ మీద వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ వివాదం ఇంకా మర్చిపోకముందే కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం పుట్టుకొచ్చింది. అదే లక్ష్మణ్ మీద మంత్రి గడ్డం వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్ మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తనను కొందరు సోషల్ మీడియాలో టార్గెట్ చేసారని , మంత్రిగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం కార్డు ఆధారంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ ని రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని, ఆయన్ని ప్రోత్సహించింది మాత్రం వెంకట స్వామి అని గుర్తు చేశారు. మంత్రి పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని ఆయన ఈ సమావేశంలోఅన్నారు. లక్ష్మణ్ వచ్చినప్పుడు నేను వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్నివివేక్ ఖండించారు.
Next Story