
కేసీఆర్‌ను కలిసిన మంత్రులు
మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు.
తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగానే మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందించారు. తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులను మాజీ సీఎం కేసీఆర్.. సాదరంగా ఆహ్వానించారు. పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో వారిని ఆహ్వానించిన కేసీఆర్.. వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగానే మేడారం ప్రసాదాన్ని అందించిన మంత్రులు.. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న జాతరను సందర్శించాలని కోరారు.
ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.

