కోలాహలంగా మిస్ వరల్డ్ అందాలభామల క్రీడల పోటీలు
x
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాలభామల యోగాసనాలు

కోలాహలంగా మిస్ వరల్డ్ అందాలభామల క్రీడల పోటీలు

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు శనివారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన క్రీడల్లో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు.


ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్స్ కార్యక్రమం కోలాహలంగా సాగింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తాంగ్ -త మార్షల్ ఆర్ట్స్ , రోలర్ స్కేటింగ్ ప్రదర్శన చేశారు.అనంతరం అందాలభామలు అంతా యోగాసనాలు చేశారు.




మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 109 దేశాల అందాల భామలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.అమెరికన్, కరీబియన్ ,ఆఫ్రికా, యూరప్,ఆసియా, ఓషియానియా విభాగాలుగా అందాలభామలను విభజించి మొత్తం పది స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించారు.




రోలర్ స్కేటింగ్, యోగ నమస్కారం, బాడ్మింటన్, షాట్ పుట్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, షటిల్, ఫిట్ నెస్ రన్ నిర్వహించారు. అనంతరం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు.అందాల భామలందరూ జుంబా డాన్స్ చేశాక ఫోటో షూట్ కార్యక్రమంతో అందాల భామలు క్రీడలు ముగిశాయి.




తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Read More
Next Story