హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ సందడి, ట్రెండింగ్‌లో అందాల భామలు
x
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల అందాల భామలు

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ సందడి, ట్రెండింగ్‌లో అందాల భామలు

హైదరాబాద్ నగరంలో మే 10వతేదీన 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి.ఈ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల అందాల భామలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.


హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం గచ్చిబౌలిలోని స్టేడియంలో కానున్నాయి. ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న నేపథ్యంలో వారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఇప్పటికే పలు దేశాల అందాల భామలు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.




ట్రెండింగులో అందాల భామలు

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణుల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల భామలు, వారి వృత్తులు, అభిరుచులపై ఆసక్తి నెలకొంది.మిస్ వరల్డ్ పోటీదారులైన అందాల భామలు అచే అబ్రహంస్(ట్రినిడాడ్ టొబాగో) ,లెసెగో చోంబో(బోట్స్వానా), యాస్మినా జైటౌన్ (లెబనాన్),జెస్సికా గాగెన్ (ఇంగ్లాండ్) ట్రెండింగులో నిలిచారు.



బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు స్వాగతం

మిస్ వరల్డ్ పోటీ కోసం హైదరాబాద్ నగరానికి ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, మానవతావాది సోనూసూద్ మంగళవారం వచ్చారు.శంషాబాద్ విమానాశ్రయంలో సోనూ సూద్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హృదయపూర్వక, సాంప్రదాయ స్వాగతం పలికారు.భారతదేశం అంతటా తన దాతృత్వ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన సోనూసూద్ కు ఘనస్వాగతం లభించింది. ఈయనకు ట్రైడెంగ్ హోటల్ లో బస కల్పించారు.



తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పేలా...

ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ సమాయత్తమైంది. ఈ కార్యక్రమంలో 116 దేశాల నుంచి అందాల భామలు పాల్గొంటారు. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా,ఇతర ప్రాంతాల నుంచి ప్రతినిధులు తెలంగాణ ఆతిథ్యాన్ని పొందుతన్నారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి, వారసత్వం,సంప్రదాయాలను ప్రపంచానికి ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.



మిస్ వరల్డ్ 2025 ఖరారైన షెడ్యూల్

మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం మే 10, సాయంత్రం 5:00 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం : 116 దేశాల నుంచి అందాల భామలు ఇప్పటికే తెలంగాణకు చేరుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీల ప్రారంభోత్సవం జరుగుతుంది.
బౌద్ధ ఆధ్యాత్మిక పర్యటన మే 12, నాగార్జున సాగర్, బుద్ధవనం : ఆసియా నుంచి 28 మంది మిస్ వరల్డ్ జట్టు సభ్యులు బౌద్ధ థీమ్ పార్క్‌ను సందర్శిస్తారు.
హైదరాబాద్ హెరిటేజ్ వాక్ మే 13, చార్మినార్, లాడ్ బజార్ : 116 మంది సుందరీమణులు హైదరాబాద్ చారిత్రక వారసత్వ నిర్మాణాలను తిలకిస్తూ టెరిటేజ్ వాక్ చేస్తారు.
స్వాగతం విందు మే 13, సాయంత్రం 6:00 గంటలకు, చౌమహల్లా ప్యాలెస్ : అద్భుతమైన చౌమహల్లా ప్యాలెస్ పర్యటన, విందుతో సంగీత కచేరీ ఉంటుంది.



వరంగల్ హెరిటేజ్ టూర్ మే 14, సాయంత్రం 5:00 గంటలకు : వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ కోట : అమెరికా నుంచి 22 మంది అందాల భామలు ఈ పర్యటనలో పాల్గొంటారు.రామప్ప ఆలయ పర్యటన మే 14, సాయంత్రం 4:30 గంటలకు : రామప్ప ఆలయం (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) యూరోపియన్ దేశాల నుంచి 35 మంది పోటీదారులు హాజరవుతారు. ఈ సందర్భంగా పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుంది.

యాదగిరిగుట్ట ఆలయ పర్యటన మే 15, సాయంత్రం 5:00 గంటలకు, యాదగిరిగుట్ట : కరేబియన్ దేశాల నుంచి 10 మంది అందాలభామలు ఈ ఆధ్యాత్మిక పర్యటనలో పాల్గొంటారు.
చేనేత అనుభవ పర్యటన మే 15, సాయంత్రం 6:00 గంటలకు, పోచంపల్లి : ఆఫ్రికన్ దేశాల నుంచి 25 మంది పోటీదారులు తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శిస్తారు.
మెడికల్ టూరిజం విజిట్ మే 16, హైదరాబాద్ : అందాల భామలు తెలంగాణలో వైద్య పర్యాటక వృద్ధిని పరిశీలిస్తారు.
పిల్లలమర్రి విజిట్ మే 16, పిల్లలమర్రి, మహబూబ్ నగర్ : అమెరికన్ గ్రూప్ నుంచి మిస్ వరల్డ్ పోటీదారులు పురాతన మర్రి చెట్టును సందర్శిస్తారు.
ఎకో టూర్ పార్క్ మే 16 ఆసియా నుంచి 24 మంది పోటీదారులు ఎక్స్‌పీరియన్స్ ఎకో-టూరిజం పార్క్‌ను సందర్శిస్తారు.
స్పోర్ట్స్ ఫినాలే మే 17, గచ్చిబౌలి స్టేడియం : అందాల భామలు స్పోర్ట్స్ ఫైనల్స్‌లో పాల్గొంటారు.
రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ మే 17, రామోజీ ఫిల్మ్ సిటీ : అందాల భామలు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను సందర్శిస్తారు.
సేఫ్టీ టూరిజం మే 18, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ : పోటీదారులు తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటరును సందర్శిస్తారు.
బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ సందర్శన : తెలంగాణ రైజింగ్ విజన్ మే 18 సాయంత్రం, సెక్రటేరియట్
సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, తెలంగాణ తల్లి విగ్రహాలను సందర్శించనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఆదివారం ఫండే కార్నివాల్‌లో అందాలభామలు పాల్గొంటారు.
కాంటినెంటల్ ఫైనల్ మే 20–21 ఖండాల వారీగా ఫాస్ట్-ట్రాక్ ఎంపిక ఉంటుంది.
ఐపీఎల్ సెమీ-ఫైనల్స్ మే 20 లేదా 21, 2025, ఆర్‌జిఐ స్టేడియం, ఉప్పల్ : క్రికెట్ ఆడే దేశాల నుంచి 20 మంది పోటీదారులు స్టేడియంలో మ్యాచ్ ను తిలకిస్తారు.
కళలు, చేతిపనులు మే 21 సాయంత్రం, శిల్పారామం : యూరప్ నుంచి 35 మంది పోటీదారులు డ్వాక్రా బజార్ స్టాల్స్‌ను సందర్శిస్తారు.



మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ మే 22, శిల్పకళా వేదిక : 116 మంది పోటీదారులు వివిధ కళారూపాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.

హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ మే 23, ట్రైడెంట్ హోటల్ : పోటీదారుల మధ్య ప్రత్యక్ష ఛాలెంజ్ పోటీ ఉంటుంది.
మిస్ వరల్డ్ టాప్ మోడల్ & ఫ్యాషన్ ఫైనల్ మే 24 సాయంత్రం, ట్రైడెంట్/హైటెక్స్ : పోటీదారులు ఫ్యాషన్, జ్యువెలరీ షోలలో పాల్గొంటారు.



బ్యూటీ విత్ ఎ పర్పస్ డిన్నర్ మే 24, హైటెక్స్ : అందాలభామలతో వేడుక విందు.

మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే 31, సాయంత్రం 5:30 గంటలకు రెడ్ కార్పెట్ : రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు జరిగే ఫైనల్ ఈవెంట్, ఇక్కడ మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2, రాజ్ భవన్ : ఆరు ఖండాల నుంచి కొత్త మిస్ వరల్డ్, విజేతలు,జూలియా మోర్లీ గవర్నర్, ముఖ్యమంత్రితో హై టీలో పాల్గొంటారు.


Read More
Next Story