నాగార్జున సాగర్‌ను తిలకించిన ప్రపంచ సుందరీమణులు
x

నాగార్జున సాగర్‌ను తిలకించిన ప్రపంచ సుందరీమణులు

తెలంగాణ సాంప్రదాయ పానీయం నీరాను రుచి చీశారు. ప్రకృతి ప్రసాదించిన పోషకాల పానీయాన్ని ఆస్వాదించారు.


మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణకు స్పెషల్ టూరిజం స్పాట్స్‌ను కలియ తిరుగుతున్నారు. తెలంగాణ సాంప్రదాయం గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం వారు సాగార్జున సాగర్‌ను సందర్శించారు. వెల్లంకి అతిథిగృహం నుంచి నాగార్జుసాగర్‌కు బయలుదేరారు. అక్కడ విజయ విహార్‌కు వెళ్లారు. ఈ టూర్‌లో భాగంగా బౌద్ధ వనం గురించి, ఈ కేంద్రం ప్రత్యేకతలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు శివనాగిరెడ్డి వివరించారు. జాతక వనంలో బుద్ధ జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను వారు సందర్శించారు.

నాగార్జున సాగర్ లోని బుద్ధ వనంలో మిస్ వరల్డ్ కాంటెస్టెంటకు జానపద, గిరిజన నృత్య కళాకారులతో గణ స్వాగతం పలికారు. మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొంటున్న ఆసియా ఓసియాన గ్రూప్ —4 లోని 22 దేశాల సుందరీమణులు ఈ రోజు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా మయన్మార్, వియత్నం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ,ఇండోనేసియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా దేశాల కాంటెస్టర్లు ఈ టూర్‌లో పాల్గొన్నారు. మిస్‌వరల్డ్‌ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యానం,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు పర్యాటక సంస్థ విజయ్‌విహార్‌లో కొంతసేపు విశ్రాంతి అనంతరం ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

నీరాకు ఫిదా

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల కోసం హైదరాబాద్‌కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు ఈరోజు తెలంగాణ సాంప్రదాయ పానీయం నీరాను రుచి చీశారు. ప్రకృతి ప్రసాదించిన పోషకాల పానీయాన్ని ఆస్వాదించారు. భలే ఉన్నాయంటూ కితాబిచ్చారు. మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలకు వచ్చిన అందగత్తెలు ఆదివారం నెక్లెస్‌రోడ్డులోని నీరా కేఫ్‌లో సందడి చేశారు. గీత కార్మికులు తాటి దొన్నెల్లో, ప్రత్యేక టిన్నుల్లో వారికి నీరా అందించారు.

Read More
Next Story