జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోరం.. చేపలవేటకు వెళ్లి శవాలైన దంపతులు
x

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోరం.. చేపలవేటకు వెళ్లి శవాలైన దంపతులు

తాటికుంట రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన దంపతులు


గల్లంతైన దంపతుల మృతదేహాలు జోగులాంబ గద్వాల జిల్లా తాటికుంట రిజర్వాయర్‌లో దొరికాయి. మల్దకల్‌ మండలం తాటికుంట గ్రామానికి చెందిన దంపతులు రాముడు(40), సంధ్య(36)లకు చేపలు పట్టడమే జీవనోపాధి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం చేపలు పట్టడానికి గ్రామానికి చెందిన రిజర్వాయర్‌కు వెళ్లారు . ప్రమాదవశాత్తు సంధ్య నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి భర్త రాముడు కూడా నీళ్లలో దూకాడు. భార్యతో సహా తానూ నీళ్లలో గల్లంతయ్యాడు. వారి ఆచూకీ కోసం గాలిస్తుంటే గురువారం ఉదయం జలాశయంలో దంపతుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబానికి చెందిన రాముడు రిజర్వాయర్ లో చేపలవేట సాగించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఇద్దరు పిల్లలు చైతన్య(8), లక్కీ(6) ఉన్నారు.

చేపల వేటకు వెళ్లిన దంపతులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. చుట్టుపక్కల ఎంత వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం భార్య భర్తలు విగత జీవులుగా లభ్యమవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Read More
Next Story