ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితం
x
Teacher MLC winners BJP Malka Komaraiah and PRTU Pingili Sripal Reddy

ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితం

ఇప్పటికి అందిన ఫలితాల ప్రకారం రెండు ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒకచోట గెలిచి మరోచోట ఓడిపోయింది.


తెలంగాణ ఎంఎల్సీ ఎన్నికల ఫలితాల్లో కడపటి వార్తలు అందేసమయానికి బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫిబ్రవరి 27వ తేదీన మూడు ఎంఎల్సీ సీట్లకు ఓటింగ్ జరిగింది. మార్చి 3వ తేదీన కౌంటింగ్ మొదలైంది. మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో ఒకటి గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటు కాగా మిగిలిన రెండు టీచర్ ఎంఎల్సీ సీట్లున్నాయి. గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటు ఓట్ల కౌటింగ్ ఇంకా జరుగుతోంది. బహుశా ఈరోజు మధ్యాహ్నంకు పైన ఫలితం తేలచ్చు. రెండు టీచర్ నియోజకవర్గాల ఎంఎల్సీల ఎన్నికల ఫలితాలు సోమవారం పొద్దుపోయాక రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మూడు సీట్లకు పోటీచేసిన బీజేపీ ఒక టీచర్ సీటును గెలుచుకుని మరో సీటులో ఓడిపోయింది. మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని ఎంఎల్సీ టీచర్ సీటులో బీజేపీ(BJP) అభ్యర్ధి మల్క కొమురయ్య(Malka Komuraiah) గెలిచారు. అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలోని రెండో టీచర్ సీటులో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన సరోత్తమరెడ్డి ఓడిపోయారు.

మల్క విషయంచూస్తే నాలుగు జిల్లాల్లో ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఉన్నారు. వీరిలో 25,041 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇందులో కూడా 897 ఓట్లు చెల్లనివిగా చెల్లినఓట్లు 24,144 ఓట్లుగా అధికారులు ప్రకటించారు. చెల్లిన ఓట్లు 24,144 కాబట్టి గెలుపుకు 12,073 ఓట్లుగా అధికారులు ఫైనల్ చేశారు. ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధికి చెల్లిన ఓట్ల మొత్తంలో సగానికి పైగా వచ్చి మరో ఓటు అదనంగా వచ్చుండాలి. ఈ లెక్కన అభ్యర్ధి గెలుపుకు అధికారులు 12,073 ఓట్లుగా తేల్చారు. ఈ లెక్కప్రకారం బీజేపీ అభ్యర్ధి మల్కకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే 12,959 ఓట్లు వచ్చేశాయి. తర్వాత స్ధానంలో వంగ మహేందరరెడ్డికి 7,182 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి కాబట్టి ఎలాంటి ఆలస్యంలేకుండా రాత్రి 10 గంటల ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించారు.

ఇక, నల్గొండ-ఖమ్మం-వరంగల్ రెండో టీచర్ సీటులో బీజేపీ అభ్యర్ధి సరోత్తమరెడ్డి ఓడిపోయారు. ఇక్కడ పోటీ బీజేపీ-ఉపాధ్యయసంఘ పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్ధి పింగిలి శ్రీపాల్ రెడ్డి మధ్యేఅని మొదటినుండి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడనుండి సుమారు ఐదు ఉపాధ్యాయసంఘాల నుండి అభ్యర్ధులు పోటీచేశారు. కౌంటింగ్ మొదలైన తర్వాతా లెక్కలన్నీ తారుమారైపోయాయి. ఎలాగంటే ఓట్లలెక్కింపులో మొదటిరౌండ్ నుండి పింగిలి ఆధిక్యంలోనే ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పింగిలికి 6,035 ఓట్లు వస్తే, రెండోస్ధానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820, మూడోప్లేసులో నిలిచిన గాల్ రెడ్డి హర్షవర్ధనరెడ్డికి 2,115 ఓట్లు వచ్చాయి. నాలుగోస్ధానంలో 3,115 ఓట్లతో పూల రవీందర్, ఐదోస్ధానంలో బీజేపీ అభ్యర్ధి సరోత్తమరెడ్డి నిలవటమే ఆశ్చర్యంగా ఉంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎంఎల్సీ ఎన్నికలో గెలుపుకు 11,821 ఓట్లు రావాలని అధికారులు ఫైనల్ చేశారు. దాంతో అందరికన్నా అతితక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధులను ఎలిమినేట్ చేస్తు వారికి వచ్చిన ఓట్లను ప్రాధాన్యతగా అత్యధిక ఓట్లు తెచ్చుకున్న వారికి కలిపారు. ఇలా చాలా రౌండ్లు జరిగిన తర్వాత అంతిమంగా పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.

ఒక ప్లస్సు, మరో మైనస్

ఇప్పటికి అందిన ఫలితాల ప్రకారం రెండు ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒకచోట గెలిచి మరోచోట ఓడిపోయింది. గెలిచిన కొమరయ్య డైరెక్టుగా ఎలాంటి సమస్యలు లేకుండా మొదటిప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిపోయారు. ఇక రెండో సీటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ సీటులో మాత్రం బీజేపీ దారుణంగా ఐదుస్ధానంతో సరిపెట్టుకున్నది. పోలింగుకు ముందువరకు బీజేపీ అభ్యర్ధి సరోత్తమరెడ్డికే గెలుపు అవకాశమని పార్టీ శ్రేణులు ఒకటే ఊదరగొట్టాయి. బీజేపీ ప్రచారం ఎలాగ జరిగిందంటే పోలింగ్ జరగటమే ఆలస్యం గెలుపు బీజేపీదే అన్నట్లుగా సాగింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తేలిందిఏమిటంటే బీజేపీ ఐదోస్ధానంలో నిలిచారు. ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పోటీకి దూరంగా ఉండగా కాంగ్రెస్(Congress) గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటుక మాత్రమే పోటీచేసి మిగిలిన రెండు టీచర్ సీట్లలో పోటీచేయలేదు.

Read More
Next Story