ఐదుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం
x

ఐదుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం

ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాల్లోని ఎన్నికల నామమాత్రంగానే నిలిచింది. పోటీ లేకపోవడంతో అద్దంకి దాయకర్, విజయశాంతి, దాసోజు శ్రావణ్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు కాకుండా మరో ఆరుగులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ వారి నామినేషన్ పత్రాలు నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Read More
Next Story