లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్‌కు ఎమ్మెల్యే వినతి, ఏం చెప్పారంటే...
బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం అమాయక గిరిజన రైతులను బలిపెట్టవద్దని జాతీయ ఎస్టీ కమిషన్ కు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కోరారు.
లగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ జాతీయ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే రాంచందర్ నాయక్,బలరాం నాయక్,బాలు నాయక్ తదితరులు సోమవారం ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ను కలిశారు.
బీఆర్ఎస్ నేతలు రాష్ట్రప్రభుత్వాన్ని అస్ధిరత పర్చే కుట్ర చేస్తున్నారని డాక్టర్ రాంచందర్ నాయక్ ఆరోపించారు.బిఆర్ఎస్ దుష్ట పాలనలో వేములఘాట్‌లో రైతు ఆత్మార్పణ,రైతులకు సంకెళ్లు వేయడం.దళితులను ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటనలు మరిచారా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్ర
రాష్ట్ర ప్రభుత్వాన్ని,పరిపాలనను అస్ధిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బి ఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ కు తెలిపారు .చిల్లర, అవకాశవాద,కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బిఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు.పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టవద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
దాడి హేయ మైన చర్య
లగచర్లలో ప్రజలు,అక్కడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులు వెళ్లినపుడు,ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే దాడికి పాల్పడడం నీచం,అత్యంత హేయమైన చర్య.జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటే దానివెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని అర్ధమవుతుంది.
రైతుల ముసుగులో అధికారులపై దాడి
రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ,స్ధానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలాంటి కుట్రపూరితచర్యలకు పాల్పడడం దురదృష్టకరమని ఎమ్మెల్యే రాంచదర్ నాయక్ చెప్పారు.రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని,వారి సమస్యలను వినడానికి,పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు.ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తుంటే రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచిపద్దతి కాదని, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని రాంచందర్ నాయక్ చెప్పారు.
Next Story