teenmar mallanna
x

మూడో రౌండ్ లో తీన్మార్ మల్లన్న ఆధిక్యం

నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు.


నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మూడు రౌండ్లు ముగియగా... మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ కౌంటింగ్ లో మల్లన్నకు 4,208 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం మూడు రౌండ్లు ముగిసేసరికి తీన్మార్ మల్లన్నకు 1,62,034 వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 87,356 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు వచ్చాయి. మొత్తం మూడు రౌండ్లలో తీన్మార్ మల్లన్న 18,880 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కొద్దిసేపటి క్రితం నాలుగో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు రౌండ్లలో 2 లక్షల 88 వేల ఓట్లు లెక్కించారు. నాలుగో రౌండ్ లో 48,013 ఓట్లను లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్ తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. నాలుగో రౌండ్ కూడా పూర్తి అయిన తర్వాత, చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించనున్నారు.

అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్క అభ్యర్థికి కూడా గెలుపు కోటాకీ సరిపడా ఓట్లు వచ్చే అవకాశం లేదు. దీంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించనున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే విజేత ఎవరో తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Read More
Next Story