హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన కవిత.. వైద్య పరీక్షల కోసమేనా..!
x

హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన కవిత.. వైద్య పరీక్షల కోసమేనా..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె ఈరోజు ఉదయం అడ్మిట్ అయ్యారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె ఈరోజు ఉదయం అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. కాగా ఆమె తీహార్‌ జైలులో ఉన్న సమయంలో పలుమార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యలు, అధిక జ్వరంతో ఆమె ఇబ్బంది పడ్డారు. దాంతో పాటుగా మరికొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఆమె ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు అస్వస్థతకు గురికావడంతో.. అప్పటి సమస్యలు ఏమైనా తిరిగి వచ్చాయా అన్న కోణంలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు కవిత మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని సమాచారం. కాగా కవిత అస్వస్థతకు గురికావడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అస్వస్థత ఏమీ లేదని, కావాలనే బీఆర్ఎస్ సింపతీ కార్డ్ ప్ల చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.

ఇదంతా సింపతీ కార్డేనా..

ఎమ్మెల్సీ కవితకు అనారోగ్యం రావడం, హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయడం అంతా కూడా బీఆర్ఎస్ ఆడుతున్న సింపతీ కార్డులో భాగమేనని కొందరు వాదిస్తున్నారు. నిజంగా ఆరోగ్యం బాగోకపోతే ఆమె తీహార్ జైలు నుంచి వచ్చిన మరుసటి రోజే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లేవారని, జైలు నుంచి ఇంటికొచ్చి నెల రోజుల తర్వాత ఏమీ లేకపోయిన ఏదో అయినట్లు హంగామా చేస్తూ వైద్య పరీక్షలకు వెళ్లాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో సింపతీ పొందడం కోసం బీఆర్ఎస్ అధిష్టానం ఈ గేమ్ ప్లే స్టార్ట్ చేసిందని సోషల్ మీడియా వేదికగా వారు విమర్శిస్తున్నారు.

Read More
Next Story