ఎమ్మెల్సీ కవితకు మరోసారి భంగపాటు
x

ఎమ్మెల్సీ కవితకు మరోసారి భంగపాటు

లిక్కర్ కేసులో మరో సారి బిఆర్ఎస్ కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.


లిక్కర్ స్కామ్ కేసులో మరో సారి బిఆర్ఎస్ కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. రెండు పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది. అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ వాదించాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపాయి.

అయితే కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలల్లో బిఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు తుది ఉత్తర్వులు తాజాగా వెల్లడించింది. అయితే ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

రెండు కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లను కవిత దాఖలు చేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్ సందర్భంగా కవిత కోర్టు దృష్టికి పలు కీలక విషయాలను తీసుకెళ్లారు. పార్టీ స్టార్ క్యాపెంయినర్‌గా ఉన్నందున ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. మహిళా నేతగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని కవిత తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను అరెస్ట్ కవిత పేర్కొన్నారు. మరో దాంట్లో ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని కవిత కోర్టులో తెలిపారు.

అరెస్ట్‌కు సరైన కారణాలు లేవని కవిత వాదనలు వినిపించారు. అయితే ఈడీ, సీబీఐ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపాయి. మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తెలిపింది. మద్యం కేసులో సూత్రధారి, కీలక పాత్రధారి కవిత అని ఈడీ సైతం తెలిపింది. గత వారం సీబీఐ కేసులో తుది ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా.. ఈడీ కేసుతో కలిపి తుది ఉత్తర్వులు వెలువరిస్తామని జడ్జి తెలిపారు. కాగా తాజాగా ఆ రెండు బేయిల్ పిటీషన్లను తిరస్కరిస్తున్నట్లు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వెల్లడించింది.


Read More
Next Story