కొడుకు కోసం కవిత ఆరాటానికి కోర్టు బ్రేక్స్
x

కొడుకు కోసం కవిత ఆరాటానికి కోర్టు బ్రేక్స్

తీహార్ జైలులో ఉన్న కవిత కొడుకు కోసం ఆరాటపడుతోంది. కానీ ఆమె ఆరాటానికి న్యాయస్థానం బ్రేక్స్ వేసి నిరాశపరిచింది. అసలు ఏం జరిగిందంటే...


ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు తీసుకెళ్తున్నపుడు కొడుకుని కౌగలించుకుని ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. తల్లి ఎక్కడున్నా బిడ్డల గురించే తపన పడుతుంటుంది. తీహార్ జైలులో ఉన్న కవిత కూడా కొడుకు కోసం ఆరాటపడుతోంది. కానీ ఆమె ఆరాటానికి న్యాయస్థానం బ్రేక్స్ వేసి నిరాశపరిచింది. అసలు ఏం జరిగిందంటే...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ నాల్గవ తేదీకి వాయిదా వేస్తూ రౌడీ రెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ జరగనుంది.

కవిత కుమారుడు మరికొద్ది రోజుల్లో పరీక్షలకు ఎగ్జామ్స్ కి అటెండ్ అవనుండటంతో మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకి ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు సీనియర్ న్యాయవాది మను సింఘ్వీ కోర్టును అభ్యర్థించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు లేకున్నా అరెస్ట్ చేశారని సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణలో ఈడీకి సహకరించినప్పటికీ ఆమెను అరెస్ట్ చేశారని తెలిపారు. కవితకి మధ్యంతర బెల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న అనంతరం కోర్టు ఏప్రిల్ 4వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న కవితను ఈడి అధికారులు అరెస్టు చేశారు. మార్చి 14వ తేదీన హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి మార్చ్ 26 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుంది. కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరచగా కవితకి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి తీహార్ జైలుకు పంపారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో నిరాశ ఎదురైంది.

Read More
Next Story