హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ సక్సెస్..!
x

హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ సక్సెస్..!

ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 మధ్య హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి.


హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం మాక్ డ్రిల్స్‌ను విజయవంతం నిర్వహించింది. భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత హీటెక్కిన క్రమంలో భద్రతా సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కేంద్రం ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిశ్చియించుకుంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. వాటి ప్రకారమే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 మధ్య హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. నాచారం, కంచన్‌బాఘ్, గోల్కొండ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్స్‌లో భాగంగాలు ప్రజలకు పలు అంశాలను సూచించారు. డ్రిల్స్‌లో భాగంగా ఇన్న‌ర్ రింగ్‌ రోడ్డు పరిధి లోపల రెండు నిమిషాల వరకు సైరెన్స్ మోగాయి.

ఈ సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్స్‌లో సైరన్‌ అత్యంత కీలకమైంది. దీనిద్వారా గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. వాయుసేనతో హాట్‌లైన్‌, రేడియో కమ్యూనికేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు, కంట్రోల్‌ రూమ్‌లు, షాడో కంట్రోల్‌ రూమ్‌ల పనితీరును పరీక్షించేందుకు ఉపయోగించారు.

Read More
Next Story