తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో ఢిల్లీ అతిథులేరీ?
x
Telangana Rising Global Summit 2047

తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో ఢిల్లీ అతిథులేరీ?

ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఢిల్లీ ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆహ్వానించారు.


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న (Telangana Global Summit)తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో ఢిల్లీ పెద్దలెవరూ రాలేదు. రెండురోజుల గ్లోబల్ సమ్మిట్ సోమవారం ఫ్యూచర్ సిటీ(Future City)లో మొదలైంది.

అంతర్జాతీయ స్ధాయి కార్పొరేట్ దిగ్గజాలు హాజరవుతున్న సదస్సుకు ప్రధాని మోదీ గైర్హాజరు లోటు స్పష్టంగా తెలుస్తోంది. మోదీనే కాదు కేంద్రప్రభుత్వంలోని కీలకశాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్, ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా హాజరుకాలేదు.

రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడులసదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరుకావాలని మోదీని స్వయంగా రేవంత్ ఢిల్లీకి వెళ్ళి ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన తెలంగాణ వాసిగా, పైగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న సదస్సు కాబట్టి హాజరయ్యారని అనుకోవాలంతే.

వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుబంధంగానే తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుందని రేవంత్ చాలాసార్లు చెప్పాడు. మోదీ చెబుతున్న 30ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో తెలంగాణ వాటాగా 3ట్రిలియన్ డాలర్లను అందిస్తామని రేవంత్ గట్టిగా చెబుతున్నాడు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రాలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లి కార్జన ఖర్గే, సీనియర్ నాయకుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాలేదు.

Read More
Next Story