డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సిరాజ్..
x

డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సిరాజ్..

క్రికెటర్ సిరాజ్ ఈరోజు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేశారు. అనంతరం అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యతలు అందుకున్నారు.


క్రికెటర్ సిరాజ్ ఈరోజు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేశారు. అనంతరం అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యతలు అందుకున్నారు. సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడడ్ి ప్రకటించారు. చెప్పినట్లే ఇప్పుడు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే సిరాజ్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. క్రికెటర్‌గా సిరాజ్.. దేశానికి చేసిన సేవలను, అందించిన కీర్తికి గుర్తింపుగా ఈ బాధ్యతలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా తాను కూడా తన బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, బేషజాలు చూపనంటూ సిరాజ్ చెప్పుకొచ్చారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో సిరాజ్ కీలకంగా వ్యవహరించాడు.

హైదరాబాద్‌కు చెందిన సిరాజ్.. టీమిండియాలో స్టార్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచకప్‌ను దేశానికి అందించడంలో సిరాజ్ కీలకంగా నిలిచాడు. అందుకు గుర్తింపు గానే మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్‌పీ పోస్ట్‌తో సత్కరించింది. ఆయనకు డీఎస్పీ పోస్ట్‌తో పాటు జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు, తెలంగాణకు సిరాజ్ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చారని సీఎం రేవంత్ అభినందించారు.

Read More
Next Story