Mohan Babu Health | మోహన్ బాబుకు స్థిమితంగా లేదు..
టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటి పోరు రచ్చకెక్కింది. గత మూడు నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ సాగుతోంది.
టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు(Mohan Babu) ఇంటి పోరు రచ్చకెక్కింది. గత మూడు నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ సాగుతోంది. అసలు వాళ్ల గొడవ ఏంటి? ఎవరెవరు కొట్టుకున్నారు? ఎందుకు కొట్టుకున్నారు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం జల్‌పల్లిలోని ఫామ్ హౌస్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. మంచు మనోజ్(Manoj Manchu).. ఫామ్ హౌస్ తలుపు పగలకొట్టుకుని లోపలికి వెళ్లడం, మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జల్‌పల్లి ఫామ్ హౌస్ దగ్గర తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మోహబాబు తలకు గాయమైంది. దీంతో ఆయనను హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్య సిబ్బంది తాజాగా బులెటిన్ ప్రకటించారు.
ఈ బులెటిన్ ప్రకారం.. మోహన్ బాబు ఒళ్లు నొప్పులు, ఆందోళన, స్పృహ తప్పిన కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆయన శరీరంపై చిన్నచిన్న గాయాలున్నాయని తెలిపారు. కాగా ఆయనకు బీపీ, షుగర్ కంట్రోల్ కావట్లేదని వైద్యులు వివరించారు. ఆయన ప్రస్తుతం స్థిమితంగా లేదని, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థం కావట్లేదని వైద్యులు చెప్పారు. ఆయన ఆర్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉందని, కంట్రోల్ కావడం లేదని, ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు వివరించారు. ఆయనకు ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఆయన ప్రస్తుతం వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని బులెటిల్ తెలిపింది. తాజాగా మీడియాతో మాట్లాడిన వైద్యులు.. మోహన్ బాబు ఎడమ కంటి కింద కమిలిన గాయం ఉందని, ఇంటర్నల్‌గా కూడా గాయాలయ్యాయని వివరించారు. ప్రస్తుతం మోహన్ బాబు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుకుని వైద్యం అందించాలని అన్నారు.