
వాన కూడా చంపేస్తాంది తెలంగాణలో...
ఈ సీజన్ వానల్లో రాష్ట్రంలో 36 మంది చనిపోయారు.
తెలంగాణలో నిర్విరామంగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ రోజుదాకా 36 మంది మృతి చెందారు. సెప్టెంబర్ 14, 15 తెదీలలో ముగ్గురు మృతి చెందారు. మరొక ముగ్గురు గల్లంతయ్యారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో డ్రెయిన్ పొంగిపొర్లిన వరదలో వీరు కొట్టుకుపోయారు. వీరికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
ఈ రుతుపవనాలలో కనివిని ఎరుగని రీతిలో వానలు వచ్చాయి. ఏడాది మొత్తం వానలో సగానికి పైగా ఒకే రోజు కురిసిన సంఘటనలు ఉన్నాయి. ఈ వానల వల్ల కొండచరియలు విరిగాయి. బ్రిడ్జిలు కూలాయి. చెరువు కట్టలు తెగాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వూర్లన్నీ వరదమయం అయ్యాయి. దీనివల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. దాదాపు రాష్ట్రమంతా జనజీవనం స్తంభించింది. సెప్టెంబర్ 15, సిద్ది పేట జిల్లాలో మేఘాలు బద్ధలయి ఒకేరోజు 242 సెంటిమీటర్లు వర్షపాతం నమోదయింది.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన చెన్నమ్మ రైతు కూలీ మృతదేహం కనిపించింది.
కవాడి గుండ్ల, చెన్నాపురం మధ్య ఉన్న గుబ్బల మంగమ్మ వాగు వరదలో కొట్టుకుపోయిన మరొక వరలక్ష్మి(53) ఆచూకి ఇంకా తెలియాల్సి ఉంది. అనేక మంది కూలీలతో కలసి వీళ్లిద్దరు ఆశ్వారావు పేట మండలం పత్తిపొలాల్లో పనిచేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన వలస కూలీలు. సెప్టెంబర్ 14న. బండువాగు వద్ద చెన్నమ్మ మృత దేహం కనిపించింది. వరలక్ష్మి ఆచూకి కనిపించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు డ్రోన్ లను రంగంలోకి దించారు.
సెప్టెంబర్ 14నే జరిగిన మరొక దుర్ఘటనలో మెదక్ పట్టణ సమీపంలోని పోచారం రిజర్వాయర్ లో పడి షేక్ మహబూబ్ (20) అనే యువకుడు మరణించాడు. వరదల వల్ల సెప్టెంబర్ 1 నుంచి 15 మంది అధికారుల కు అందిన సమాచారం ప్రకారం 21 మంది చనిపోయారు. ఆగస్టు 12 నుంచి 30 మధ్య మరొక 13 మంది చనిపోయారు.
ఇక భారీ వర్షాలకు సంబంధించి సోమవారం నాడు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాాలోని ఘట్ కేషర్ లో 96 మి.మీ వర్షం పాతం నమోదయింది. ఇదే విధంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్ కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ లలో కూడా 96 మి.మీ వర్షపాతం నమోదయింది.