
ఇద్దరు కవల పిల్లల గొంతు నులిమి చంపి తానూ ఆత్మహత్య
హైదరాబాద్ బాలానగర్ లో దారుణం
హైదరాబాద్ బాలానగర్ లో మంగళవారం నాడు దారుణం జరిగింది. మాతృత్వానికే కళంకం తెచ్చిన ఘటన ఇది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లే ఇద్దరు పిల్లల చావుకు కారణమైంది. తర్వాత తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ నాలుగో ప్లోర్(టెర్రస్) నుంచి దూకి చనిపోయింది. తల్లి దూకడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమచారమిచ్చారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తల్లి పిల్లల మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
27 ఏళ్ల చల్లారి శ్రీలక్ష్మి తన కవల పిల్లలను అత్యంత కర్కషంగా గొంతు నులిమి చంపి తానూ ఆత్మహత్య(Sucide) చేసుకోవడం తెలంగాణలో సంచలనమైంది. చల్లారి శ్రీ లక్ష్మికి లాస్యవల్లి, చేతన కార్తికేయ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రెండేళ్ల వయసు గల ఇద్దరు కవల పిల్లలకు తన ఇంట్లోనే భర్త అనిల్ కుమార్ బయటకు వెళ్లినప్పుడు హత్య చేసింది.
పిల్లల అనారోగ్య సమస్యల మీద భార్యభర్తలు తరచూఘర్షణ పడే వారు అని బాలానగర్ ఇన్ స్పెక్టర్ టి. నరసింహా రాజు చెప్పారు.సాయిలక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివాడు.
శ్రీలక్ష్మి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త అనిల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న భవనం దగ్గర దొరికిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు.