ఎన్నికల వేళ ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట
x

ఎన్నికల వేళ ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా న్యాయస్థానం బిగ్ రిలీఫ్ ఇచ్చింది.


కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా న్యాయస్థానం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అవినాష్ ముందస్తు బెయిల్ కోరుతూ గతంలో ఒక పిటిషన్ ను వేశారు. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దస్తగిరి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మరోవైపు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా ఆయన బెయిల్ పిటిషన్ కి తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది.

వైస్ వివేకా హత్య కేసు లో గతేడాది అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు లో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి అవినాష్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. తనకి అవినాష్ రెడ్డి తో ప్రాణహాని ఉందని, తన చుట్టూ జరుగుతున్న పరిణామాలకు అవినాష్ రెడ్డే కారణమని దస్తగిరి పిటిషన్ లో పేర్కొన్నాడు. అవినాష్ రెడ్డి బయట ఉండి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించాడు. అయితే దస్తగిరి పిటిషన్ లోనే సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ బెయిల్ ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కానీ తెలంగాణ హైకోర్టు వీటిని పరిగణలోకి తీసుకోలేదు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ ని కొట్టివేసింది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఇది భారీ ఊరటగా పరిగణించవచ్చు. ప్రస్తుతం ఆయన వైసీపీ కడప ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.


Read More
Next Story