
ప్రాణత్యాగానికి సిద్ధమన్న ఎంపీ ఓవైసీ
పాకిస్తాన్ మాత్రం ఇస్లాంపేరుతో మారణహోమం సృష్టిస్తోందని మండిపోయారు
భారతదేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొట్టడంలో అవసరమైతే ప్రాణత్యాగంచేయటానికి దేశంలోని ముస్లింలందరు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ చెప్పారు. ఇస్లాంపేరు పలికే అర్హత పాకిస్తాన్(Pakistan) కు లేదన్నారు. శాంతి, సామరస్యానికి ప్రతిరూపం ఇస్లాం అని ఎంపీ వివరించారు. పాకిస్తాన్ మాత్రం ఇస్లాంపేరుతో మారణహోమం సృష్టిస్తోందని మండిపోయారు. తన చేష్టలకు పాకిస్తాన్ సరైన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. చిన్నపిల్లల్ని, అమాయకులను పాకిస్తాన్ మతంపేరుతో చంపేస్తోందని ఆవేధన వ్యక్తంచేశారు. ఇస్లాంపేరుతో పాకిస్తాన్ అబద్ధపు ప్రచారంచేస్తు మనదేశంలో మారణహోమం సృష్టిస్తోందని మండిపోయారు.
పాకిస్తాన్ విధానాలను తాము ఎప్పుడో వ్యతిరేకించిన విషయాన్ని అందరు గుర్తించాలన్నారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టేంత సామర్ధ్యం భారత్ కు ఉందని ఓవైసీ(Asaduddin Owisi) గుర్తుచేశారు. దేవుడి దయవల్లే మనమంతా భారతదేశం(India)లో పుట్టినట్లు ఓవైసీ చెప్పారు. ఈభూమిపైన జన్మించిన తాము ఈ భూమికోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దాయాది దేశం దుశ్చర్యలను ప్రతి భారతీయుడు తిప్పికొట్టాలని పిలుపిచ్చారు. పహల్గాం(Pahalgam Terror Attack)లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకులను చంపినందుకే భారత బలగాలు పాకిస్తాన్ పైన దాడులుచేసిందన్నారు. దాయాదిదేశంపై భారత్ బలగాలు(India-Pakistan War) దాడులుచేయటంలో తప్పేలేదన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు మాట్లాడుతున్నట్లుగా ఓవైసీ గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. దేశంలో ఎన్నిసార్లు, ఎన్నిచోట్ల ఉగ్రదాడులు జరిగినా, అమాయకులు మరణించినా ఓవైసీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడిందిలేదు. ఇపుడు ఓవైసీ భారత్ పైన అపారమైన దేశభక్తి, పాక్ పైన మండిపోతున్న ఓవైసీ తన తమ్ముడు, ఎంఎల్ఏ అక్బరుద్దీన్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినపుడు నోరిప్పలేదు. 15 నిముషాలు కళ్ళుమూసుకుంటే చాలు తాము దేశాన్ని ఊచకోత కోసేస్తామని బహిరంగంగా హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో తమ్ముడు చేసిన ప్రకటనను ఓవైసీ తప్పుపట్టలేదు, బహిరంగంగా ఖండించలేదు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాతే ఓవైసీలో దేశభక్తి ఒక్కసారిగా పొంగిపొరలుతోంది. పహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఓవైసీ దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఇతర పార్టీల నేతలెవరు పాక్ వ్యతిరేక ప్రచారంచేయకపోయినా ఓవైసీ మాత్రం విపరీతంగా దేశమంతా తిరిగారు. మార్పు మంచిదే అన్నట్లుగా దేశభక్తి పొంగుతున్న సమయంలోనే పాక్ వ్యతిరేక చర్యలను ఖండించటం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా లైన్ తీసుకోవటం అందరికీ మంచిదే అనటంలో సందేహంలేదు. ఈ లైనాఫ్ థింకింగ్ లో ఓవైసీలో ఎంతకాలం ఉంటుందో చూడాల్సిందే.