రాహుల్ చీకటి రహస్యాల గోలేంటి?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బ్లిట్జ్ ఈ మ్యాగజీన్ వేదికగా బంగ్లాదేశ్ జర్నలిస్టు సలాహుద్దీన్ షోయబ్ చౌదురి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి వద్ద హల్చల్ చేశారు. రాహుల్ గురించి బంగ్లాదేశ్ కు చెందిన బ్లిట్జ్ అనే పత్రిక ప్రచురించిన కథనాల కాపీలను తన వెంట తీసుకువెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను గేటు వద్ద ఆపి, ఎందుకు వచ్చారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను లోపలికి పంపించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ పార్టీ నాయకులతో సమావేశమై ఉన్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా శాసనసభ ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన రాహుల్ ని కలిసేందుకు వీలుపడలేదు. దీంతో ఆయన తన వెంట తెచ్చిన బ్లిట్జ్ మ్యాగజిన్ కాపీలను అక్కడ రిసెప్షన్ సిబ్బందికి అప్పగించి బయటకు వచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు... బ్లిట్జ్ మ్యాగజిన్ లో వచ్చిన కథనాలకు రాహుల్ ఏం సమాధానం చెబుతారో తెలుసుకోవడానికి వచ్చానన్నారు. ఇప్పటివరకు ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదని, అందుకే తాను నేరుగా రాహుల్ ని కలిసి వివరణ తీసుకోవడానికి వచ్చానని తెలిపారు. పత్రిక కథనంలో రాహుల్ గాంధీకి పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని ప్రచురించారని చెప్పారు. ఒకవేళ అది తప్పుడు కథనం అయితే ఎందుకు ఆ పత్రికకు నోటీసులు ఇవ్వలేదని నిలదీశారు. లేకుంటే ఆ ఫోటోలోని మహిళ రాహుల్ భార్య అని ఒప్పుకోవాలన్నారు.
Visited the residence of @RahulGandhi and handed over copies of Blitz magazine to his staff. pic.twitter.com/pYPveUfkKh
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) August 23, 2024
రాహుల్ చీకటి రహస్యాలు పేరిట కథనం...
కాంగ్రెస్ అగ్రనేత లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బ్లిట్జ్ ఈ మ్యాగజీన్ వేదికగా బంగ్లాదేశ్ జర్నలిస్టు సలాహుద్దీన్ షోయబ్ చౌదురి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. "రాహుల్ గాంధీపైన నాకు ఎలాంటి వ్యక్తిగత పగ లేదు. ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నిజాలు వెలికి తీయడం నా బాధ్యత. అందులోనూ అది భారతదేశం లాంటి అతి పెద్దదైన, పురాతనమైన ప్రజాస్వామ్య దేశ భవిష్యత్తు ఆధారపడిన వ్యక్తి చీకటి రహస్యాలు అయినప్పటికీ బయట పెట్టాల్సిందే" అని సలాహుద్దీన్ రాసుకొచ్చాడు.
"ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అనిశ్చితి నెలకొంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా అక్కడి నుంచి ఇండియాకి పారిపోయి వచ్చారు. అక్కడ ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. షేక్ హసీనా పార్టీకి చెందిన నేతలందరినీ ఈ ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. కానీ, డాక్టర్ గౌహర్ రిజ్వీని మాత్రం ఏమీ చేయడం లేదు. ఆ వ్యక్తి మరెవరో కాదని, సోనియా గాంధీ కజిన్ భర్తే. సోనియా గాంధీకి కావాల్సిన వ్యక్తి అవడం వల్లే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు."
ఇంతకంటే సంచలన విషయం ఏంటంటే... బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు రాహుల్ గాంధీకి లింక్ ఉంది. బంగ్లాదేశ్‌లోని BNP పార్టీ చీఫ్ ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ తో రాహుల్ గాంధీ లండన్ లో భేటీ అయ్యాడు. అక్కడే ఇదంతా ప్లాన్ చేశారు. ఇంత జరుగుతుంటే భారత ప్రభుత్వానికి విచారణ జరిపించే బాధ్యత లేదా?" అని జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
"నేను లౌకికవాదాన్ని నమ్మే మనిషిని. జవహర్ లాల్ నెహ్రూ ఎన్ని పెళ్లి చేసుకున్నాడు? పెళ్ళికి ముందు సోనియాగాంధీకి కొంతమంది మగవాళ్ళతో ఉన్న సంబంధాలు నాకు అనవసరమైన విషయం. ఆ వ్యక్తిగత విషయాలు అందరికీ తెలిసినవే. నా ఉద్దేశం ఒకటే. రాహుల్ గాంధీ గురించి భారతీయులు ఎన్నో నిజాలు తెలుసుకోవాలి. రాహుల్ గాంధీకి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు పిల్లలున్నారు. విదేశాల్లో ఆయన రౌల్ విన్సీ అనే పేరుతో చెలామణి అవుతున్నాడు. బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉంది" అని రాసుకొచ్చాడు.
"రాహుల్ చాలా స్నేహపూర్వక వ్యక్తి. అతను స్వభావంలో చాలా సెక్యులర్ అని మాకు తెలుసు. అతనికి వేయించిన బేకన్, బీఫ్ స్టీక్ అంటే చాలా ఇష్టం. అతని జీవనశైలి పూర్తిగా పాశ్చాత్యమైనది. అతను హిందూ కుటుంబానికి చెందినవాడని మేము ఎప్పుడూ భావించలేదు" అని రాహుల్ గాంధీ గురించి, ట్రినిటీ కాలేజీకి చెందిన మాజీ క్లాస్మేట్ చెప్పాడని కథనంలో పేర్కొన్నారు.