చంద్రబాబు ప్రభుత్వానికి మార్కులు ఇవ్వటానికి నిరాకరించిన ఎంపీ
x
Chandrababu Naidu

చంద్రబాబు ప్రభుత్వానికి మార్కులు ఇవ్వటానికి నిరాకరించిన ఎంపీ

జగన్ను తీవ్రంగా వ్యతిరేకించిన రేణుక అవసరార్ధం ఆమధ్య మళ్ళీ చంద్రబాబుకు మద్దతుదారుగ మారారు


చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందా ? పడిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని రేణుక చెప్పటమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు(Chandrababu)ను అనేకసార్లు రేణుక(Renuka Chowdhary) మద్దతుపలికిన విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు సన్నిహితంగా ఉన్న వీళ్ళిద్దరు తర్వాత వివిధ కారణాలతో విడిపోయారు. విభేదించుకోవటం మళ్ళీ కలవటం వీళ్ళిద్దరికీ కామన్ అయిపోయింది. జగన్ను తీవ్రంగా వ్యతిరేకించిన రేణుక అవసరార్ధం ఆమధ్య మళ్ళీ చంద్రబాబుకు మద్దతుదారుగ మారారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒకటేకావటంతో కలవటానిక ఎలాంటి ఇబ్బందులు లేకపోయింది. అలాంటి రేణుకా చౌదరి ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని చెప్పటమే సంచలనంగా మారింది.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్ని మర్కులు వేస్తారని యాంకర్ వేసిన ప్రశ్నకు రేణుక మాట్లాడుతు చంద్రబాబు ప్రభుత్వం బాగా డౌన్ అయిపోయిందన్నారు. జగన్ వెళితే చంద్రబాబు ఉద్ధరిస్తారని అందరం అనుకుంటే పొడిచేసింది ఏమీలేదని నిర్వికారంగా మాట్లాడారు. ఏరోజైతే సెంటర్లోని బీజేపీ(BJP) చేతులు పట్టుకుని, తొత్తుగా మారి వాళ్ళు చెప్పిందానికల్లా తలూపటంతో ఎంటైర్ సౌత్ అంతా ఇబ్బందుల్లో పడే ప్రమాదం వచ్చిందని మండిపోయారు. ఇలాంటి అనేక కారణాలతో చంద్రబాబు ప్రభుత్వానికి తాను మార్కులు వేయదలచుకోలేదని స్పష్టంగా చెప్పారు.

చంద్రబాబు పాలననుండి తాము ఎంతో ఆశించినట్లు ఎంపీ చెప్పారు. అయితే చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు జరుగుతున్న పాలనకు చాలా తేడాలున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు పాలనలో అనుభవంలేదని చెప్పేందుకు కూడా లేదన్నారు. పాలనలో చాలా అనుభవం ఉంది కాబట్టే తననుండి చాలా ఎక్కువ ఊహించినట్లు ఎంపీ తెలిపారు. అయితే తనలాంటి వాళ్ళందరినీ చంద్రబాబు తీవ్రంగా నిరాసపరిచినట్లు రేణుకా చౌదరి ఆవేధన వ్యక్తంచేశారు. అందుకనే చంద్రబాబు ప్రభుత్వానికి తాను మార్కులు వేయనని చెప్పారు.

Read More
Next Story