ఫాల్కన్ స్కాం మాస్టర్‌మౌండ్ అరెస్ట్
x

ఫాల్కన్ స్కాం మాస్టర్‌మౌండ్ అరెస్ట్

సంస్థ ఎండీ అమర్‌దీప్‌ను అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.


ఫాల్కన్ స్కాం.. రెండు తెలుగు రాష్ట్రాలకు కుదిపేసింది. పెట్టుబడుల రూపంలో వందల కోట్ల రూపాయల మోసం చేశారు. దాదాపు రూ.1700 కోట్లు వసూలు చేసి జెండా తిప్పేసింది. ఈ నగదు మొత్తాన్ని విదేశాల్లో ఉన్న డొల్ల కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేసింది. దీనిప కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కాగా తాజాగా ఈ కేసులో కీలక పురోగతి లభించింది. అసలు ఈ స్కాం మాస్టర్‌మైండ్, ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్‌దీప్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదయిన కొన్నాళ్లకే ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్ కుమార్ సహా సీఈఓ, సీఓలును దుబాయ్‌కి వెళ్లిపోయారు. తాజాగా ఎండీ అమర్‌దీప్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కుంభకోణం ఒక కొలిక్కి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

చిన్నపెడ్డుబడులు పెద్ద కంపెనీల్లో భారీ లాభాలు అంటూ ప్రజలకు ఫాల్కన్ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఈ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈఓడబ్ల్యూ కూడా ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ స్కీమ్ ద్వారా ఫాల్కన్ సంస్థ రూ.1700 కోట్లు వసూలు చేయగా.. అందులో కేవలం హైదరాబాద్ నుంచే రూ.850 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి దారుల నుంచి వసూలు చేసిన డబ్బును ఎప్పటికప్పుడు విదేశాలకు తరలించారు. 22 షెల్ సంస్థల ద్వారా విదేశాలకు పెట్టుబడిదారుల డబ్బును మళ్లించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బు చేరింది.

Read More
Next Story