మందకృష్ణ మాదిగ అక్రమ కట్టడాలు నేలమట్టం
x

మందకృష్ణ మాదిగ అక్రమ కట్టడాలు నేలమట్టం

హనుమకొండలో 400 గజాల స్థలం ఆక్రమించి భవనాలు కట్టిన మందకృష్ణ మాదిగ.


మాదిగల హక్కుల కోసం పోరాటం చేస్తూ సామాజిక విప్లవకారుడిగా ఎదిగిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఎమ్మారపీఎస్‌ను స్థాపించిన మాదిగల హక్కుల కోసం ఎనలేని పోరాటు చేశారాయన. అయితే తాజాగా ఆయన అక్రమ కట్టడాలపై మున్సిపల్ బుల్డోజర్లు కదం తొక్కాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు మందకృష్ణకు చెందిన పలు నిర్మాణాలను అక్రమ కట్టడాలుగా గుర్తించారు. వెంటనే యాక్షన్‌లోకి దిగిన అధికారులు శనివారం వాటిని నేలమట్టం చేశారు. హనుమకొండలోని హంటర్ రోడ్డు సర్వే నెంబర్ 125కేలోని 400 గజాల స్థలంలో కట్టిన నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. తమకు చెందిన 400 గజాల స్థలాన్ని మందకృష్ణ మాదిగ, జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి అందులో నిర్మాణాలు చేపట్టారంటూ నంబూరి చారుమతి అనే మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. ఆక్రమణల మాట వాస్తవమేనని నిర్దారించారు. సెప్టెంబర్ 2022లో సదరు కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే అధికారులు ఆదేశాలు ఇచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఈ కట్టడాలను కూల్చివేయలేదంటి చారుమతి అనే మహిళ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో 2024 జనవరిలోపు సదరు కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మానవ హక్కుల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను మందకృష్ణ మాదిగ.. హైకోర్టులో సవాల్ చేశారు. కానీ ఆయనకు అక్కడ కూడా ఊరటలభించలేదు. దాంతో అధికారులు తాజాగా ఆయన కట్టడాలను కూల్చేశారు.

Read More
Next Story