‘కూల్చివేతపై కోర్టుకెళ్తాం’.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున
x

‘కూల్చివేతపై కోర్టుకెళ్తాం’.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున

రాష్ట్రంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన కట్టడాల అంతు చూస్తోంది హైడ్రా. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా చూసినా హైడ్రానే హల్‌చల్ చేస్తోంది.


రాష్ట్రంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన కట్టడాల అంతు చూస్తోంది హైడ్రా. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా చూసినా హైడ్రానే హల్‌చల్ చేస్తోంది. చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కనిపిస్తే వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతోంది. తెలంగాణలోని చెరువులు, కుంటలకు ఆక్రమణ నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా హైడ్రా కూల్చేసింది. మాదాపూర్‌లోని తుమ్మడికుంట చెరువును ఆక్రమించి నాగార్జున కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారన్న ఆరోపణలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవి ఏమీ కావు. కన్నేళ్లుగా ఇవి వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆపరేషన్ హైడ్రాలో భాగంగా చేపట్టిన సర్వేలో తమ్మడికుంట చెరువు ఆక్రమణకు గురైణట్లు నిర్ధారితమైంది. దీంతో అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. ఇది చాలా బాధాకరమైన విషయమంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

అంగుళం కూడా ఆక్రమించలేదు..

‘‘కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేడయం చాలా బాధకలిగించింది. మా ప్రతిష్టను కాపాడుకోవడానికి, కొన్ని నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి, తమ్మడి గుంటను ఆక్రమించామని మాపై పడిన మచ్చను తొలగించుకోవడానికే ఈ ప్రకటన చేస్తున్నాను. ఇది సరైన నిర్ణయమే అని నేను భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్‌ను తాము పట్టా భూమిలోనే నిర్మించామని చెప్పారు. ‘‘అది పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన కట్టడం ఎన్ కన్వెన్షన్. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారం లేదా చట్టవిరుద్ధంగా జరిగింది’’ అని వివరించారు.

ఏ నోటీసులు రాలేదు

‘‘ఈరోజు కూల్చి వేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఈ కూల్చివేతను నేనే స్వయంగా జరిపించి ఉండే వాడిని. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ద చర్యలపై మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది’’ అని రాసుకొచ్చారు.

Read More
Next Story