నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత
x

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పెరిగిన ఇన్ ఫ్లో


ఎగువ నుంచి కురుస్తున్న భారీవర్షాలకు నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఇరిగేషన్ అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ఈ వర్షాకాలంలో క్రస్ట్ గేట్లను ఎత్తడం ఇది ఐదోసారి. స్పిల్ వే ద్వారా 2, 68,749 క్యూసెక్కుల నీటిని క్రిందకు వదిలారు. నాగార్జునసాగర్ కు ఇన్ ప్లో 3, 21,023 క్యూసెక్కులు వస్తుంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుతం మూడువందల ఐదు టిఎంసీలు కొనసాగుతోంది.నాగార్జున సాగర్ జలాశయం బ్రిటీషు కాలంలో నిర్మించారు.

Read More
Next Story