
రేవంత్, చంద్రబాబు కలలను కలిపే నాలుగు ముళ్ల బంధం
ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం త్వరలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం
హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే (Greenfield Expressway) నిర్మాణం గురించి చర్చించేందుకు తొందరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సమావేశమవుతారని తెలిసింది.
ఈ నాలుగు లేన్ల మహా రహదారి (Four lane Expressway) నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట ప్రభుత్వాల అధికారులు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు డీపీఆర్ చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.
నిజానికి ఇది హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్ ప్రెస్ హైవే కాదు. ఇద ఒక ప్రత్యేక హైవే. ఇద్దరు మఖ్యమంత్రలు కలలను కలిపే నాలుగు ముడుల బంధం.
అమరావతి గ్లోబల్ సిటీని చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాపత్రయం. ఇది పదేళ్లుగా నానుతున్న ప్రతిపాదన. అమరావతి కలలనగరం ఎలా ఉంటుందో ఇప్పటికే గ్రాఫిక్స్ చూపించాయి. ఐకానిక్ టవర్లు, ఉద్యానవనాలతో కృష్ణానది ఒడ్డున అదొక హరితమహానగరం అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆయన దృష్టంతా అమరావతి మీదే ఉంది.
ఇక రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పాలకుల ముద్రలు తక్కువ. వీటికి అవకాశం లేకుండా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ చేసేశారు. అందుకే భారత రాష్ట్ర సమితి(BRS) ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (KCR) ఎన్ని యాడ్ చేసినా, ఉన్న హైదరాబాద్ కుతోడయ్యాయి తప్ప మరొక హైదరాబాద్ ను సృష్టించలేదు.
చరిత్రలో చూస్తే హైదరాబాద్ ను పాలించిన వాళ్లంతా కొత్త నగరాలను సృష్టించో, నగరాన్ని విస్తృతపరిచో వెళ్లారు. ఉదాహరణకు గోల్కొండ ఇరుకయినపుడు కుతుబ్ షాహి సుల్తాన్ హైదరాబాద్ ను 1591లో నిర్మించాడు. ఆతర్వాతి పాలకులు సికిందరాబాద్ ను జోడించారు. బ్రిటిష్ వాళ్లు సికిందరాబాద్ ను తీర్చిదిద్దారు. స్వాతంత్య్రానంతరం తెలుగు పాలకులు హైటెక్ సిటీ, సైబరాబాద్ లుగామార్చారు. మెట్రో రైలు తెచ్చి నగర దూర తీరాలను కలిపారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం వచ్చాక హైదరాబాద్ హంగులు తెచ్చిన కొత్త సెక్రటేరియట్, అమరవీరుల స్తూపాలు కేవలం రీప్లేస్ మెంట్స్ మాత్రమే. అందుకే ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రభుత్వం ఆనవాళ్లు హైదరాబాద్ ఉన్నా అవి నగరం పేరుకు మరొక విశేషణం చేర్చలేకపోయాయి.
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నాటి కుతుబ్ షాహి పాలకులలాగా ఆలోచించి మరొక నగరం నిర్మించి స్థిరపడిపోవాలనుకుంటున్నారు. ఆకల నుంచి వచ్చిందే పోర్త్ సిటి (Fourth City).
ఇంకా ఏరూపంతీసుకోని చంద్రబాబు ఫ్యూచర్ సిటి (Future City). ఇంకా కాగితాల మీది నుంచి భూమ్మదికి దిగని ఫోర్త్ సిటి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటి. ఈ సిటీలను నిర్మించడానికి ఎంతకాలం పడుతుందో, ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలియదు గాని, ఇద్దరు ముఖ్యమంత్రులు తమ కలల నగరాలను కలుపుతూ నాలుగు ముళ్ల బంధం నాలుగు లేన్ల రహదారితో వేయాలనుకుంటున్నారు. ఈ నగరాలు తయారయినా కాకపోయినా, ఈ జాతీయ రహదారి పనులు ప్రారంభమయితే చాలు, ఈ రహదారి పొడువునా రియల్ ఎస్టేట్ వ్యాపారం లక్షల కోట్లకు చేరుకుంటుంది. పరిమ్రలు వస్తాయి. కొత్త వూర్లు కాలనీలు పుట్టుకొస్తాయి. ఈ రహదారి పెద్ద బిజెనెస్ కారిడార్ అవుతుంది. రెండు రాష్ట్రాలకు భారీ రాబడి పెరుగుతుంది. కాసుల కష్టాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులకు ఈ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసినప్పటినుంచి రాబడి పెరుగుతుంది.
అందుకే హైదరాబాద్- అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అనేది ఆంధ్రా-తెలంగాణ లను మళ్లీ దగ్గరకు చేర్చే సరి గేమ్‌ఛేంజర్ అని అంటున్నా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి సుముఖత చూపడంతో కేంద్రం కూడా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆలస్యమెందుకు, ఈ ఫోర్ లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసి కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ కు పంపాలని కేంద్రం ఆదేశించింది. ఇరు రాష్ట్రాలలలో హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం హడావిడి ఎక్కువయింది.
తిరకాసు ఇక్కడే ఉంది. విడిపోయిన రెండు రాష్ట్రాలను బలంగా కలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ఈ ఫోర్త్‌సిటీ నుంచి ఈ హైవే మొదలవుతుందని చెబుతున్నారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన అని ఈ హైవే గురించి బాగా తెలిసిన కాంగ్రెస్ లోక్ సభ సభ్యులొకరు ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. అమరావతి-ఫోర్త్‌సిటీని కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వస్తే విజయవాడ-హైదరాబాద్ ల మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారికి అది సమాంతర రోడ్డు అవుతుంది. ఇప్పుడున్న జాతీయ రహదారికి అటూఇటుగా 10 కి.మీ. దూరంలో ఇది నిర్మాణమవుతుంది. ఇది తమ నియోజకవర్గాల మీదుగా వెళ్లాలని ఎంపిలనుంచి ఎమ్మెల్యే లనుంచి అపుడే వత్తిడి మొదలయిట్లు కూడా తెలిసింది.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road : ORR) లోని ఏదో ఒక ఎగ్జిట్ వే వద్ద నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించే అవకాశం ఉంది. ఈ నాలుగు వరసల రహదారి కి సర్వీస్ రోడ్లు ఉండవు. ఇది రెండు రాజధానుల మధ్య ప్రయాణ సమాయాన్ని సగానికి తగ్గించందు నిర్మించే ఈ రహదారి అంతర్జాతీయ ప్రమాణాలనతోఉంటుందని ఫలితంగా అతి తక్కువగా ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టుల ప్రారం భోత్సవాలకు వచ్చిన కేంద్ర ఉపరితల రావాణ మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు బహిరంగంగా సుముఖత వ్యక్తం చేశారు. “ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మిస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణ సమయం తగ్గతుంది. దీనితో ఎగుమతులు, దిగుమతులకు పెరుగుతాయి,” అని ఆయన చెప్పారు.