నల్గొండ కలెక్టర్ మానవత్వం, నిత్యకు అండా దండా
x
అనాథగా మారిన నిత్యకు రూ.5లక్షల చెక్కును అందజేస్తున్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిఫాఠి

నల్గొండ కలెక్టర్ మానవత్వం, నిత్యకు అండా దండా

తల్లీ, తండ్రి, తమ్ముడు మరణించడంతో నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారి నిత్య అనాథగా మారింది.


నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం అగమోత్కూర్ గ్రామానికి చెందిన చిన్నారి నిత్య (Nithya) జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొదట తల్లి మరణించడంతో నిత్యకు తండ్రే తల్లీతండ్రి పాత్ర పోషించాడు. తాజాగా తండ్రి, నిత్య తమ్ముడు కర్మకాండలు చేస్తుండగా కాల్వలో మునిగి మరణించడంతో నవ్య అనాథగా మారింది.తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో దిక్కూ మొక్కూ లేని నిత్యకు తీవ్ర విషాద సమయంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు.

చిన్న వయసులోనే అనాథగా మారిన నిత్య పరిస్థితి గురించి తెలుసుకున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆమెకు అండగా నిలిచారు.వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిత్యకు రూ. 5లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. రూ.5లక్షల డబ్బును ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో చదువు కొనసాగించాలని కలెక్టర్ నిత్యకు సూచించారు. కలెక్టర్ నిత్య పట్ల చూపించిన మానవత్వానికి (HumanityInAction) ప్రజలు అభినందించారు.


Read More
Next Story