అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు..
x

అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు..

నటుడు అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ ఘటన కేసులో జనరల్ బెయిల్ వచ్చింది.


నటుడు అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ ఘటన కేసులో జనరల్ బెయిల్ వచ్చింది. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 13 డిసెంబర్ 2024న అల్లు అర్జున్‌ను ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా అదే సమయంలో హైకోర్టు మధ్యంత బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చారు. కాగా అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా.. అందుకోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు అల్లు అర్జున్.. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు ఆమోదం తెలుపింది.

Read More
Next Story