నందమూరి తేజస్వినీ వీడియో వైరల్
x
నందమూరి తేజస్వినీ డాన్స్

నందమూరి తేజస్వినీ వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ కుమార్తె, ఎంపీ భరత్ భార్య తేజస్వినీ వాణిజ్య ప్రకటనలో మొట్టమొదటిసారి కనిపించారు.


ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె, విశాఖ పార్లమెంట్ సభ్యుడు భరత్ మతుకుమిల్లి భార్య మతుకుమిల్లి తేజస్వినీ మొట్టమొదటిసారి తాజాగా ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా వీడియో వాణిజ్య ప్రకటనలో నటించారు.‘‘ నా ఆత్మవిశ్వాసం..నా ఆనందం ..డాన్స్ నా ఉత్సాహం.. నా అనుబంధం.. నా సంతోషం... మన సంస్కృతీ సంప్రదాయాలు మన ఆభరణాలు’’అంటూ నందమూరి తేజస్వినీ తాడు సాయంతో గోడపైకి ఎక్కి సాహసం చూపించడంతోపాటు ముద్దుగుమ్మలతో కలిసి డాన్స్ చేసి అలరించారు. ఈ వాణిజ్య ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


విశాఖ ఎంపీ భరత్ ఎక్స్ పోస్టుకు నారా లోకేష్ అభినందన
తన భార్య తేజస్వినీ మొట్టమొదటిసారి నటించిన వాణిజ్య ప్రకటన వీడియోను విశాఖ ఎంపీ భరత్ మతుకుమిల్లి ఎక్స్ పోస్టులో షేర్ చేశారు. ‘‘ప్రియమైన తేజస్విని, మీ మొదటి వాణిజ్య ప్రకటనతో మీరు తెరపైకి అడుగుపెట్టడం చూసి చాలా సంతోషంగా ఉంది. మీరు దీన్ని అందంగా చేశారు సమతుల్యత, నమ్మకంతో. దీన్ని చూసి నాకు గర్వంగా ఉంది. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను!’’అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

నా తొలి వీడియో...

‘‘నా తొలి తెరపై క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం అవాస్తవంగా అనిపిస్తుంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, కౌస్తుబ హై జ్యువెలరీ డిజైన్ స్టూడియోతో నేను ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాను! దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’అంటూ నందమూరి తేజస్వినీ ఎక్స్ లో పోస్టు చేశారు.

నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన

నందమూరి తేజస్వినీ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ‘‘బాలయ్య అల్లుళ్లే కాదు..కుమార్తెలు ధైర్యవంతులు..ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉత్సాహం కలిగించడంలో ..పబ్లిక్ లైఫ్ లో ఉండటం సంతోషం..అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.‘‘తాతకు తగ్గ మనుమరాలు, తండ్రికి తగ్గ తనయురాలు. చూడడానికి రెండు కళ్లు సరిపోవట్లేదు తేజమ్మా... భరత్ గారు తేజస్విని గారికి దిష్టి తీయించండి సార్’’ అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘జీవితం లో ప్రతిఒక్కరికి అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకోవడం లో మన పాత్ర ముఖ్యం.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు వెళ్ళటమే. విజయాన్ని అందుకోమని తమరు ఇస్తున్న ప్రోత్సాహం, మీ విలువలకు నిదర్శనం’’అని మరో నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘మేడమ్ తేజస్విని తథా తండ్రి గారి నటన వారసత్వం ,నందమూరి బ్లడ్ లో నటన ,దైర్యం ,దర్పం ఉన్నై ,ఆల్ ది బెస్ట్ ’’ అంటూ మరో నెటిజన్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.



Read More
Next Story