Narendramodi | తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో మోదీ భేటీ
x

Narendramodi | తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో మోదీ భేటీ

తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.మోదీని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్ర సమస్యలు,బీజేపీ భవిష్యత్తు పై చర్చించారు.


తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు(Telangana BJP MLAs&MP) బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో(Narendra Modi) భేటీ అయ్యారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రధానితో కలిసి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి విన్నవించారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ భవితవ్యంపై ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీతో చర్చించారు. తెలంగాణ బిజెపికి చెందిన 8 మంది లోక్‌సభ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ సహా పలువురు బీజేపీ ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.


ప్రధాని మోదీ ఎక్స్ పోస్టు
‘‘తెలంగాణ బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు, అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు.ప్రజలు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందని బీజేపీ నేతలు మోదీకి వివరించారు. తమ పార్టీ కార్యకర్తలు అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు.తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంచి అవకాశం ఉందని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ రీ పోస్ట్

తెలంగాణకు చెందిన 18 మంది బీజేపీ ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేస్తుందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ఎక్స్ పోస్టులో చెప్పారు. కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ యత్నిస్తుందని చెప్పారు.



కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని(Nitin Gadkari) కలిశారు.తాము తెలంగాణలో కొనసాగుతున్న, రాబోయే రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులపై(Development projects in Telangana) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.





Read More
Next Story