హైదరాబాద్ లో రెచ్చిపోతున్న నేపాలీ దొంగలు
x

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న నేపాలీ దొంగలు

మలక్ పేటలో భారీ చోరీకి పాల్పడి రూ 50 లక్షల నగదు. 30 తులాల బంగారం, 40 తులాల వెండితో పరారీ


హైద్రాబాద్ , సికింద్రాబాద్ జంటనగరాల్లో నెపాలీ ముఠాలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాయి . తాజాగా మలక్ పేటలోని ఒక ఇంటిలో ఈ ముఠాసభ్యులు భీభత్సం చేశారు. హైదరాబాద్ లో మలక్ పేటలో భారీ చోరీ జరిగింది. ఆఫీసర్స్‌ కాలనీలో రూ.50లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండితో దొంగలు ఉడాయించారు. ఈ మేరకు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నేపాలీ ముఠా చోరీకి పాల్పడినట్లు కంప్లయింట్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది.


గత నెల కార్ఖానాలో

గత నెలలో నెపాలీముఠా కార్ఖానాలో భారీ చోరీకి పాల్పడింది. పనిచేస్తున్న ఇంటికే నేపాలీ ముఠా కన్నం వేసింది. యజమానిని కట్టేసి పెద్దమొత్తంలో బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కార్ఖానా పీఎస్‌ పరిధిలోని గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో 75 ఏళ్ల కెప్టెన్‌ గిరి అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లో నేపాల్‌కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. మరో నలుగురితో కలిసి చోరీకి ప్లాన్‌ చేసిన అతడు ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి అతడిని మంచానికి కట్టేశారు.


కెప్టెన్ గిరి ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత నేపాలీ ముఠా పారిపోయింది. తర్వాత కెప్టెన్ గిరి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అతన్ని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు రూ.50 లక్షల విలువచేసే బంగారు నగలతోపాటు నగదు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. 25 తులాలకుపైగా బంగారం, రూ.23 లక్షల నగదు చోరీ చేశారని కెప్టెన్ గిరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేసి 13 సభ్యులతో కూడిన ముఠాను అరెస్ట్ చేసిన మరుసటి రోజే మలక్ పేటలో భారీ చోరీ జరిగింది. నెల రోజుల వ్యవధిలో జంటనగరాల్లో రెండు భారీ చోరీ కేసులు నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుస దొంగతనాల్లో నేపాలీ ముఠాల ప్రమేయం ఉందన్న వార్త కలకలం రేపింది.

Read More
Next Story