మల్నాడు డ్రగ్ రాకెట్ లో కొత్త కోణం
x

మల్నాడు డ్రగ్ రాకెట్ లో కొత్త కోణం

నైజీరియన్ యువతులతో వ్యభిచారం


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ రాకెట్ లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెస్టారెంట్ యజమాని సూర్య నేరుగా డ్రగ్స్ కొనుగోళ్లు, విక్రయాలు చేసినట్టు ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో ఈ వ్యాపారం నిర్వహించేవాడు. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. సూర్యను ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. సూర్య డ్రగ్స్ చేరవేయడానికి, విక్రయాలు జరపడానికి నైజీరియన్ యువతులను వాడుకున్నట్టు ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ చేరవేస్తే రూ 1000 , విక్రయాలు చేస్తే రూ 3000 నైజీరియన్ యువతులకు ఇచ్చేవాడని దర్యాప్తులో తేలింది.

నైజీరియన్ యువతులను కేవలం డ్రగ్స్ విక్రయాలకే గాకుండా వ్యభిచారం చేయించినట్టు వెలుగులోకి వచ్చింది

60 మంది యువతులు బెంగుళూరు , ఢిల్లీ, ముంబై నగరాల్లో డ్రగ్స్ వ్యాపారంతో బాటు వ్యభిచారం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

సూర్యను కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈగల్ టీం అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

తెలంగాణ నార్కోటిక్ టీం పేరును ఈగల్ టీంగా మార్చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఈగల్ టీం సిద్దం చేశారు. తెలంగాణలో కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక్క గంజాయి మొక్క ఉన్నా ఈగల్ టీం తన డేగ కళ్లతో పసిగడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలె చెప్పారు.


Read More
Next Story