తెలంగాణలో దొరికిన ఆదిమ మానవుడి రాతి మచ్చుకత్తి
తెలంగాణలో ఎటూచూసినా పురాతన మానవుడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అవి మాయం కాకముందే రికార్డు చేసేందుకు తెలంగాణ చరిత్ర బృందం పనిచేస్తూ ఉంది.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు అహోబిలం కరుణాకర్ ఆదిమ మానవుడి మచ్చుకత్తి కనుగొన్నారు.
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామం పాటిగడ్డ మీద ఈ రాతి మొద్దు కత్తిని గుర్తించాడు. ఆయన పరిశీలించిన ప్రదేశానికి సమీపంలో పెద రాతియుగం సమాధులున్నాయి.
పురామానవులు వేటాడిన జంతువులను కోసుకుని తినడానికి, ముక్కలుగా నరకడానికి వాడిన పనిముట్లలో ఈ మచ్చుకత్తి లేదా మొద్దుకత్తి ఒకటి. పట్టుకోవడానికి పిడికిలి ఉన్న పదునైన అంచున్న రాతికత్తి ఇది. 10అంగుళాల పొడవు, 7అంగుళాల వెడల్పు కలిగివున్నది.
గతంలో తెలంగాణ ప్రాక్చరిత్రకారుడు కీ.శే.ఠాకూర్ రాజారాంసింగ్ చెప్పినట్టు ఇటువంటి పనిముట్లు జంతువధశాలల వద్ద లభిస్తాయి. ఈ పరికరం కొత్తరాతియుగానికి చెందిందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.
Next Story